నేను ఇంకా ఎంతకాలం కొట్లాడాలి.. బోధన్ సభలో కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు!

ఈరోజు బోధన్ బీఆర్ఎస్ మహాసభలో సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎంతకాలం కొట్లాడాలని అన్నారు. తెలంగాణ భవిష్యత్ కోసం ఈసారి మీరు కొట్లాడాలని ప్రజలకు సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.

New Update
నేను ఇంకా ఎంతకాలం కొట్లాడాలి.. బోధన్ సభలో కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Telangana Elections 2023: తెలంగాణlలో ఎన్నికల సమయం దగ్గరపడుతోంది. ప్రచారం చేసేందుకు సమయం తక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ఈరోజు ప్రచారంలో భాగంగా బోధన్ లో పర్యటించారు సీఎం కేసీఆర్ (CM KCR). అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేను ఇంకా ఎంతకాలం కొట్లాడాలి.. జీవితాంతం కొట్లాడుతూనే ఉండాలా? అని ప్రజలను ప్రశ్నించారు. ఈ సారి మీరు కొట్లాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తాను బతికున్నంత కాలం తెలంగాణ సెక్యూలర్ గానే ఉండాలని ఉద్ఘాటించారు. కాంగ్రెస్ కు (Congress) ఓటేసి ప్రమాదం కొనితెచ్చుకోవద్దని అన్నారు. రైతులు కాంగ్రెస్ నాయకుల మాటలకు మోసపోవద్దని హెచ్చరించారు.

ALSO READ: స్కిల్ స్కామ్ కేసులో ట్విస్ట్.. చంద్రబాబు బెయిల్‌ రద్దు

సమైక్య రాష్ట్రంలో నిజాంసాగర్‌ను కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎండబెట్టిందని మండిపడ్డారు. ఏడాది మొత్తం నిజాంసాగర్‌ను నిండుగా ఉంచే బాధ్యత బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వానిది అని అన్నారు. వ్యవసాయ స్థిరీకరణ జరగాలని బీఆర్ఎస్ శ్రమించిందని పేర్కొన్నారు. వ్యవసాయ స్థిరీకరణ కోసం సాగునీటి పన్ను రద్దు చేశామని సీఎం కేసీఆర్ వెల్లడించారు.

రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏనాడైనా రైతుబంధు గురించి ఆలోచన చేసిందా? అని ప్రశ్నించారు. ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని కాంగ్రెస్‌ నేతలు అంటున్నారని విమర్శించారు. ధరణిని తీసేస్తే రైతుబంధు డబ్బులు బ్యాంకు ఖాతాల్లోకి ఎలా వస్తాయి? ఆలోచించుకోండి అని ప్రజలను సీఎం కేసీఆర్ కోరారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే దళారీల రాజ్యం వస్తుందని హెచ్చరించారు.

ALSO READ: ఆ కేసులో నమిత భర్తకు షాక్ ఇచ్చిన పోలీసులు.. సమన్లు జారీ

విచక్షణతో ఓటు వేసి సరైన ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకోవాలని సీఎం కేసీఆర్ అన్నారు. ఎన్నికల్లో ప్రజలు గెలవాలి.. ప్రజలు గెలిస్తేనే అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. తెలంగాణ ప్రజల కోసమే బీఆర్ఎస్ పార్టీ కృషి చేస్తోందని అన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు