హైదరాబాద్‌లోని నాంపల్లి బజార్‌ఘట్‌లో జరిగిన ప్రమాదంలో ఏడుగురు మృతి చెందిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాయాలపాలైనవారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో అగ్నిప్రమాదంపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపాన్ని ప్రకటించారు. పటిష్ఠమైన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. అలాగే తీవ్రంగా గాయపడ్డవరాకి మెరుగైన చికిత్స అందించాలని ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ చర్యలు తీసుకోవాలని సూచించారు.
Also Rea: ప్రచారంలో వేగం పెంచుతున్న బీజేపీ…16న మేనిఫెస్టో విడుదల
మరోవైపు ఈ ప్రమాదంపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్ అగ్నిప్రమాదాలకు నిలయంగా మారిపోయిందని.. వరుసగా ప్రమాదాలు జరుగుతున్నా కూడా ప్రభుత్వం నివారణ చర్యలు చేపట్టడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. అపార్ట్‌మెంట్ సెల్లర్‌లో కారు మరమ్మతులు ఏంటి.. రెసిడెన్షియల్ ఏరియాలో కెమికల్ డ్రమ్ములు ఎలా నిల్వ చేశారంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. మరోవైపు మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు.
ఇదిలా ఉండగా.. నాంపల్లిలోని ప్రమాదం జరిగిన భవనంలో గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఓ గ్యారేజ్ ఉంది. అయితే అందులో కారు రిపేర్ చేస్తుండగా ఒక్కసారిగా మంటలు వచ్చాయి. అక్కడే డీజిల్, కెమికల్ డ్రమ్ములు ఉన్నాయి. దీంతో వాటికి అంటుకోవడంతో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి . ప్రస్తుతం గ్యారేజ్‌లోని మిగిలిన కెమికల్ డబ్బాలను అగ్నిమాపక సిబ్బంది బయటకు తీసుకొచ్చారు. ప్రమాదంతో గ్యారేజ్‌లో ఉన్న పలు వాహనాలు దగ్ధమైపోయాయి. ఇక ఈ ఘటనలో 21 మంది అస్వస్థతకు గురికాగా వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.