Big Breaking: సీఎం కేసీఆర్‌కు తప్పిన ప్రమాదం.. హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్ అయ్యింది. దేవరకద్ర వెళ్తుండగా సాంకేతిక లోపం తలెత్తడంతో అత్యవసర ల్యాండింగ్ చేసినట్లు సమాచారం

New Update
Big Breaking: సీఎం కేసీఆర్‌కు తప్పిన ప్రమాదం.. హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పెనుప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్ అయ్యింది. దేవరకద్ర వెళ్తుండగా సాంకేతిక లోపం తలెత్తింది.  దీంతో వెంటనే హెలికాప్టర్‌ను వెనక్కి మళ్లించి ఎర్రవల్లిలోని కేసీఆర్‌ వ్యవసాయ క్షేత్రంలో అత్యవసర ల్యాండింగ్‌ చేశారు. మరోవైపు బీఆర్ఎస్ నేతలు ప్రత్యామ్నాయ హెలికాప్టర్‌ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ హెలికాప్టర్‌ రాగానే ముఖ్యమంత్రి పర్యటన యథావిథిగా కొనసాగనుంది.

అయితే అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్‌ ఈరోజు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని దేవరకద్ర, నారాయణపేట, మక్తల్‌, గద్వాల్‌ నియోజకవర్గాల్లో జరగనున్న ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొనాల్సి ఉంది. అయితే హెలిక్యాప్టర్‌లో సాంకేతిక లోపం కారణంగా ఆయన పర్యటన ఆలస్యం కానుంది.

Advertisment
తాజా కథనాలు