CM KCR: కేసీఆర్‌కు తప్పిన ప్రమాదం.. హెలికాప్టర్‌‌లో సాంకేతిక లోపం!

సీఎం కేసీఆర్ హెలికాప్టర్‌లో మరోసారి సాంకేతిక లోపం తలెత్తింది. సిర్పూర్‌లో సీఎం కేసీఆర్ హెలికాప్టర్ టేకాఫ్ కాలేదు. దీంతో రోడ్డుమార్గంలో ఆసిఫాబాద్‌కు సీఎం కేసీఆర్ చేరుకున్నారు.

New Update
CM KCR: కేసీఆర్‌కు తప్పిన ప్రమాదం.. హెలికాప్టర్‌‌లో సాంకేతిక లోపం!

KCR District Tours: ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈ క్రమంలో ప్రచారాల్లో దూకుడు పెంచారు అన్నీ పార్టీల నేతలు. జిల్లాల పర్యటనల్లో బిజీగా ఉన్న గులాబీ బాస్ సీఎం కేసీఆర్(CM KCR)కు పెను ప్రమాదం తప్పింది. సీఎం కేసీఆర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌(Helicopter)లో సాంకేతిక లోపం తలెత్తింది. సిర్పూర్‌లో బీఆర్ఎస్(BRS) ప్రజాశీర్వాద సభ ముగించిన సీఎం కేసీఆర్.. ఆసిఫాబాద్‌కు వెళ్లేందుకు హెలికాప్టర్‌లో ఎక్కారు. ఈ క్రమంలో హెలికాఫ్టర్ పైకి ఎగరడం లేదు. సాంకేతిక లోపం గుర్తించిన పైలెట్ టెక్ ఆఫ్ చేయకుండా హెలికాఫ్టర్ ఆపేశాడు. దీంతో సీఎం కేసీఆర్ కు పెను ప్రమాదం తప్పిందనే చెప్పాలి.

Also Read: బాణసంచా నిషేధం అన్ని రాష్ట్రాలకు.. సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

ఆసిఫాబాద్‌(Asifabad)లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజాఆశీర్వాద సభకు తన కాన్వాయ్ బస్సులో స్థానిక ప్రజాప్రతినిధులు, ఇతర నేతలు రోడ్డు మార్గం ద్వారా చేరుకున్నారు. సీఎం కేసీఆర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తడం ఇది రెండోసారి. దేవరకద్రకు ఇలాగే హెలికాఫ్టర్ లో కేసీఆర్ బయలుదేరారు. గాల్లో ఉండగానే.. టెక్నికల్ సమస్య రావడంతో పైలెట్ హెలికాఫ్టర్ ను తిరిగి ఎర్రవల్లి ఫాంహౌస్ లో సురక్షితంగా ల్యాండ్ చేశారు. వరుసగా సీఎం కేసీఆర్ కు ఇలా జరగడం పలు అనుమానాలకు దారి తీస్తున్నాయి.

Also Read: విద్యార్థులకు GOOD NEWS.. సెలవులు పెంపు!

ఆసిఫాబాద్‌కు చేరుకున్న కేసీఆర్ సభలో మాట్లాడాడుతూ.. తెలంగాణ తెచ్చుకోవడం వల్లే ఆసిఫాబాద్‌ జిల్లా అయ్యిందని అన్నారు. గతంలో వానాకాలం వస్తే మంచం పట్టిన మన్యం అని పత్రికల్లో వార్తలు వచ్చేవని.. ఇప్పుడు ఆసిఫాబాద్‌లో మెడికల్‌ కళాశాల, వంద పడకలతో ఆసుపత్రి వచ్చాయని పేర్కొన్నారు. జల్‌, జంగిల్‌, జమీన్‌ నినాదంతో పోరాడిన కుమురం భీం పేరును జిల్లాకు పెట్టుకున్నామని తెలిపారు. గిరిజనులు కాని వారికి కూడా త్వరలో పట్టాలు ఇస్తామని.. మాలి కులస్థుల సంక్షేమానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు