Jagan: 'మ్యారేజీ స్టార్ పవన్ కార్లను మార్చినట్లు భార్యలను మారుస్తున్నాడు'.. జనసేనానిపై జగన్ కౌంటర్లు.!

భీమవరంలో జగనన్న విద్యాదీవెన కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం జగన్. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ పై సెటైర్లు వేశారు. మ్యారేజీ స్టార్ ముచ్చటగా మూడు పెళ్లిళ్లు చేసుకుని మూడు సంవత్సరాలు కూడా కాపురం చేసి ఉండరని.. కార్లను మార్చినట్లు భార్యలను మారుస్తున్నాడని కౌంటర్లు వేశారు.

New Update
AP CM :  పవన్ ఓటమే లక్ష్యం.. వైఎస్ జగన్ కీలక మీటింగ్!

CM Jagan Satires on Pawan Kalyan Marriages: టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu), జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఏపీ సీఎం జగన్ మరోసారి విమర్శలు గుప్పించారు. భీమవరంలో జగనన్న విద్యాదీవెన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం ప్రతిపక్ష నేతలపై కౌంటర్లు వేశారు. వెన్నుపోటు పొడిచే చంద్రబాబు రాజకీయం అందరికీ తెలుసునని అన్నారు. దత్తపుత్రుడు పక్క రాష్ట్రంలో ఉంటూ చంద్రబాబు సీఎం కావాలని పార్టీ పెట్టిన వాడని.. ఇలాంటి వాళ్లు దేశ చరిత్రలో ఎవరూ ఉండరని అన్నారు.

Also Read: ‘పిచ్చి పిచ్చి సినిమాలు తీసి ప్రజలను రెచ్చగొట్టొద్దు’..ఆర్జీవీకి కాంగ్రెస్ పార్టీ నేత వార్నింగ్.!

త్యాగాల త్యాగరాజు పవన్ (Pawan Kalyan).. చంద్రబాబు సీఎం అయితే చాలు.. అదే తనకు వందల కోట్లు అని, బాబు కోసమే తన జీవితమంటూ అని మాట్లాడుతారని ఎద్దెవ చేశారు. ఎన్ని సీట్లు ఇచ్చినా సరే..ఇవ్వకపోయినా సరే ప్యాకేజీల కోసం త్యాగాలు చేసే వారిని ఇప్పుడే చూస్తున్నామని కౌంటర్లు వేశారు. చంద్రబాబు, పవన్ లు కలిసి ఉమ్మడి మ్యానిఫేస్టోలు ఇస్తారట అని కామెంట్స్ చేశారు.

Also Read: విశాఖలో వైసీపీకి మరో షాక్..బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ రాజీనామా ?

పవన్ మ్యారేజ్ స్టార్ అంటూ సెటైర్లు వేశారు. రియల్ లైఫ్ లో ముచ్చటగా మూడు పెళ్లిళ్లు చేసుకున్న ఆయన మూడు సంవత్సరాలు కూడా కాపురం చేసి ఉండరని..పెళ్లి అనే సంప్రదాయాన్ని మంటగలుపుతున్నాడని ఫైర్ అయ్యారు. తోడేళ్లన్నీ ఏకమై జగన్ మీద యుద్ధం చేయడానికి సిద్ధమయ్యారన్నారు. వీళ్లెవరికీ ఒంటరిగా పోటీ చేసే సత్తా లేదని విమర్శనాస్త్రాలు సంధించారు.

Advertisment
తాజా కథనాలు