YSR Rythu Bharosa: జగన్ ప్రభుత్వం ఏపీ రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 7న శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో పర్యటించనున్న ముఖ్యమంత్రి జగన్(CM Jagan).. అక్కడ రైతు భరోసా-పీఎం కిసాన్ నిధులు (PM Kissan Scheme) విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. రైతు భరోసా పథకం ద్వారా ప్రతి ఏడాది రైతులకు జగన్ సర్కార్ రూ.13,500 ఆర్ధిక సాయం అందిస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న పీఎం కిసాన్ నిధులతో కలిసి వీటిని ఇస్తోంది. ఏడాదికి మూడు దఫాలుగా ఈ సాయం అందిస్తోంది. తొలి విడత కింద రూ.7,500, రెండో విడత రూ.4 వేలు, మూడో విడత రూ.2 వేలు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు అకౌంట్లలో జమ చేస్తోంది.
Also Read: కామారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా రేవంత్ రెడ్డి!
శుక్రవారం రోజున సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రి మండలి సమావేశం అయింది. అనంతరం ఈ సమావేశంలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలను మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ మీడియాతో పంచుకున్నారు. సంక్షేమ పథకాల క్యాలెండర్‌ను యథావిధిగా అమలు చేయనున్నట్లు స్పష్టం చేశారు. నవంబర్ 7న రైతు భరోసా రెండో విడత, నవంబర్ 15న భూ పంపిణీ కార్యక్రమం, నవంబర్ 28న విద్యా దీవెన (Jagananna Vidya Deevena) నిధుల విడుదల, నవంబర్ 30న కాల్యాణమస్తు షాదీ తోఫా (YSR Shaadi Tohfa) నిధులను విడుదల చేయనున్నట్లు మంత్రి తెలిపారు.
Also Read: ఎమ్మెల్యే రాజాసింగ్ ఆస్తులు ఎంతో తెలుసా?