CM Jagan: ఆంద్రప్రదేశ్ లో తుఫాన్ తో నష్టపోయిన రైతులకు ముఖ్యమంత్రి జగన్ తీపి కబురు అందించారు. ఇటీవల తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పంటలు, రంగుమారిన వరి ధాన్యం కొనుగోలుపై తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో అధికారులతో సీఎం జగన్ ఈ రోజు సమీక్ష నిర్వహించారు. రంగుమారిన, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
ALSO READ: ఆసుపత్రికి రావద్దు.. కేసీఆర్ సంచలన వీడియో
ఆర్బీకేల వారీగా ధాన్యం కొనుగోళ్లు చేయాలని పేర్కొన్నారు. పంట నష్టపోయిన రైతులకు పంటల బీమా ద్వారా పరిహారం అందించాలని స్పష్టం చేశారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఈనెల 18 వరకు పంటనష్టం అంచనా ఇచ్చిన అధికారులు. ఈనెల 26 నాటికి పంట నష్టం తుది నివేదిక ఇవ్వాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ధాన్యం కొనుగోలు విషయంలో లిబరల్ గా ఉండాలని.. సంక్రాంతిలోపు రైతులకు సబ్సీడీ అందేలా చూస్తామని పేర్కొన్నారు.
రేపు సీఎం వైయస్ జగన్ తిరుపతి పర్యటన
సీఎం జగన్ మోహన్ రెడ్డి రేపు (13.12.2023) తిరుపతిలో పర్యటించనున్నారు. శ్రీసిటీ ఎండీ రవి సన్నారెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజరుకానున్నారు. మధ్యాహ్నం 3.45 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి తిరుపతి చేరుకుంటారు, అక్కడ తాజ్ హోటల్‌లో శ్రీసిటీ ఎండీ రవి సన్నారెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజరవుతారు, అనంతరం రాత్రికి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.