Covid JN1 CM Jagan Review : కరోనా కొత్త వేరియెంట్ పై సీఎం జగన్ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు!

ఏపీలో పెరుగుతున్న కరోనా కేసుల గురించి ముఖ్యమంత్రి జగన్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో అధికారులు కేసులు పెరగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.

New Update
YCP Focus:  విశాఖపై వైసీపీ స్పెషల్ ఫోకస్..!

CM JAGAN Review About New Corona JN1 : కరోనా కొత్త రూపం జేఎన్‌1(Corona JN1) దేశంలో విస్తరిస్తున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం(AP Government) అప్రమత్తమైంది. సీఎం జగన్(CM Jagan) శుక్రవారం తాడేపల్లి క్యాంప్‌ ఆఫీసులో మంత్రులు, వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. అధికారులు ముందస్తు చర్యలపై దృష్టి పెట్టాలన్నారు. ప్రజలు దీని గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేకపోయినప్పటికీ..అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.

ఈ వేరియంట్‌ కి డెల్టా వేరియంట్ తరహా లక్షణాలు లేవని వివరించారు. అయితే జేఎన్‌1కు వేగంగా విస్తరించే లక్షణం ఉందని పేర్కొన్నారు. ఈ లక్షణాలు కనిపించే వారికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరీక్షలు చేపడుతున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఎవరికైతే పాజిటివ్‌ లక్షణాలు కనిపిస్తాయో వారి శాంపిల్స్‌ ను విజయవాడ జీనోబ్‌ ల్యాబ్‌ కు పంపి పరీక్షిస్తున్నట్లు తెలిపారు.

గ్రామ, వార్డు సచివాలయాల వద్ద ర్యాపిడ్‌ టెస్టింగ్‌ కిట్స్ పెడుతున్నట్లు అధికారులు వివరించారు. అదే విధంగా ఆసుపత్రుల్లో పర్సనల్‌ కేర్‌ కిట్లు కూడా అందుబాటులోకి తీసుకుని వచ్చినట్లు తెలిపారు. అవసరమైన మందులు కూడా అందుబాటులో ఉన్నాయని అధికారులు వివరించారు. ముందు చర్యల్లో భాగంగా ఆక్సిజన్ ఇన్‌ఫ్రాను కూడా సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు.

దీని గురించి జగన్‌ మాట్లాడుతూ..ఈ వేరియంట్‌ వల్ల ఆందోళన లేకపోయినా..ముందు చర్యల మీద దృష్టిపెట్టాలని అధికారులను ఆదేశించారు. ముందస్తు చర్యల కోసం గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను అప్రమత్తం చేసినట్లు వివరించారు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా బోధన చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు. ఈ సమావేశంలో వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజినీ,.ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Also read : తిరుమలలో భారీగా పెరిగిన రద్దీ..సర్వ దర్శనం నిలిపివేత!

Advertisment
తాజా కథనాలు