చంద్రబాబు కేసుల విషయంలో జగన్ సర్కార్ (AP Government) మరో సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. స్కిల్ డెవలప్మెంట్ కేసును (Skill Development Case) సీబీఐకు అప్పగించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ కేసులో ఈడీ విచారణ జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ కీలక నిర్ణయం తీసుకునేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. ఉండవల్లి పిటిషన్ విచారణ సందర్భంగా సీబీఐ (CBI) దర్యాప్తునకు అభ్యంతరం లేదని చెప్పిన అడ్వకేట్ జనరల్ న్యాయస్థానానికి చెప్పిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలను పరిశీలిస్తే ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించాలని జగన్ సర్కార్ భావిస్తున్నట్లు అర్థం అవుతోంది. స్కిల్ డవలప్మెంట్ కేసులో సీబీఐ దర్యాప్తు కోరుతూ నిర్ణయం తీసుకోవాలని న్యాయ స్థానాలను ప్రభుత్వం కోరనున్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: Skill Development Scam Case:స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఉండవల్లి పిటిషన్‌ను స్వీకరించిన హైకోర్టు
ఇదే జరిగితే.. ఇప్పటికే ఏసీబీ కేసులతో సతమవుతూ 36 రోజులుగా జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు మరిన్ని ఇబ్బందులు తప్పవనే చెప్పాలి. ప్రభుత్వం కక్షతోనే చంద్రబాబుపై కేసులు పెడుతోందన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలోనే జగన్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు ఏపీ రాజకీయవర్గాల్లో చర్చ సాగుతోంది. తద్వారా తాము వాస్తవాల ఆధారంగానే కేసులు పెట్టామన్న సంకేతం ప్రజల్లోకి వెళ్తుందన్న భావనలో జగన్ సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Chandrababu health: జైల్లో చంద్రబాబుకు ఆ ఆరోగ్య సమస్య.. వైద్యుల షాకింగ్ ప్రకటన.. టీడీపీ శ్రేణుల్లో టెన్షన్.. టెన్షన్..
అయితే.. మరో రెండు, మూడు రోజుల్లోనే ఈ అంశంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. జగన్ ప్రభుత్వం స్కిల్ డవలప్మెంట్ కేసును సీబీఐకి అప్పగిస్తే ఏపీ రాజకీయాల్లో మరిన్ని సంచలన మార్పులు వచ్చే అవకాశం ఉంది.