CM Jagan Delhi Tour: ఒక రోజు ముందుగానే ఢిల్లీకి జగన్.. ముందస్తు ఎన్నికల కోసమేనా?

ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ఖరారైంది. రేపు ఉదయం 10 గంటలకు విజయవాడ నుంచి జగన్ ఢిల్లీకి బయల్దేరనున్నారు. రెండు రోజుల పాటు జగన్ ఢిల్లీలో పర్యటించనున్నారు. ముందస్తు ఎన్నికలపై ఢిల్లీ పెద్దలతో సీఎం జగన్ చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

CM Jagan Delhi Tour: ఒక రోజు ముందుగానే ఢిల్లీకి జగన్.. ముందస్తు ఎన్నికల కోసమేనా?
New Update

ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన (CM Jagan Delhi Tour) ఖరారైంది. రేపు ఉదయం 10 గంటలకు విజయవాడ నుంచి జగన్ ఢిల్లీకి బయల్దేరనున్నారు. రెండు రోజుల పాటు జగన్ ఢిల్లీలో పర్యటించనున్నారు. రేపు సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi), హోం మంత్రి అమిత్ షా తో సీఎం భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 6వ తేదీ ఉదయం కేంద్రం నిర్వహించే వామపక్ష తీవ్రవాదం సమీక్ష సమావేశంలో జగన్ పాల్గొంటారు. వాస్తవానికి మొదటగా జగన్ 6, 7 తేదీల్లో ఢిల్లీలో పర్యటిస్తారని ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. కానీ తాజాగా షెడ్యూల్ మారింది. చంద్రబాబు అరెస్ట్ (Chandrababu Arrest), లోకేష్ కు నోటీసుల నేపథ్యంలో జగన్ ఢిల్లీ పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. ఏపీలో ముందస్తు ఎన్నికల అంశంపై జగన్ ఢిల్లీ పెద్దలతో మాట్లాడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Chandrababu case: చంద్రబాబు రిమాండ్‌ పొడిగింపు?? కొద్ది గంటల్లో ఏం జరగబోతోంది?

చంద్రబాబు అరెస్ట్, వరుస కేసులు, లోకేష్ కు నోటీసుల నేపథ్యంలో ఆ పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ నేపథ్యంలో ఎన్నికలకు వెళ్తే తమకు అడ్వాంటేజ్ అని అధికార పార్టీ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే సీఎం జగన్ ఢిల్లీకి వెళ్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒక వేళ బయట ప్రచారం జరుగుతున్నట్లే జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్తే ఎలా అన్న చర్చ కూడా టీడీపీలో మొదలైంది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కోవడానికి తాము సిద్ధమంటూ పలువురు టీడీపీ నేతలు కూడా ధీమా వ్యక్తం చేశారు.

#ap-politics #ap-cm-jagan #modi #2024-elections
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe