AP players: ఏషియన్ గేమ్స్ క్రీడాకారులను అభినందించిన జగన్... భారీ నజరానా ప్రకటన

అంతర్జాతీయ వేదికలపై తెలుగువారి ఖ్యాతిని నిలబెడుతున్న ఏపీ క్రీడాకారులను సీఎం జగన్‌ అభినందించారు. ఏషియన్‌ గేమ్స్‌లో పాల్గొన్న ఏపీ క్రీడాకారులు కోనేరు హంపి, బి.అనూష, యర్రాజీ జ్యోతి.. సీఎం జగన్‌ను ఇవాళ క్యాంప్‌ కార్యాలయంలో కలిశారు.

AP players: ఏషియన్ గేమ్స్ క్రీడాకారులను అభినందించిన జగన్... భారీ నజరానా ప్రకటన
New Update

అమరావతి: సీఎం క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్‌ను ఏషియన్‌ గేమ్స్‌లో పతకాలు సాధించిన ఏపీ క్రీడాకారులు కోనేరు హంపి, బి.అనూష, యర్రాజీ జ్యోతి కలిశారు. అంతర్జాతీయ వేదికలపై తెలుగువారి ఖ్యాతిని నిలబెడుతున్న ఏపీ క్రీడాకారులను సీఎం జగన్‌ అభినందించారు. జాతీయ, అంతర్జాతీయ క్రీడలలో పతకాలు సాధించిన క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న ఏపీ ప్రభుత్వం.. క్రీడలకు మరింతగా ప్రాధాన్యత ఇస్తున్నామని సీఎం తెలిపారు. ఇటీవల చైనాలోని హాంగ్జౌ నగరంలో జరిగిన 19వ ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన కోనేరు హంపి, బి.అనూష, యర్రాజీ జ్యోతి తాము సాధించిన పతకాలను సీఎంకు క్రీడాకారులు చూపించారు. స్పోర్ట్స్‌ పాలసీ ప్రకారం క్రీడాకారులకు ఇచ్చే నగదు పురస్కారాన్ని ప్రభుత్వం విడుదల చేసింది.

This browser does not support the video element.

విజేతలకు నగదు బహుమతి

విశాఖపట్నం జిల్లాకి చెందిన మైనేని సాకేత్‌ సాయికి టెన్నిస్, ఏషియన్‌ గేమ్స్‌ సిల్వర్‌ మెడల్‌ విజేతకు రూ. 20 లక్షలు, ఎన్టీఆర్‌ జిల్లాకు చెందిన వెన్నం జ్యోతి సురేఖ ఆర్చరీ, ఏషియన్‌ గేమ్స్‌లో 3 గోల్డ్‌ మెడల్స్‌ విజేతకు, రూ. 90 లక్షలు, గుంటూరుకు చెందిన కిడాంబి శ్రీకాంత్ బాడ్మింటన్, ఏషియన్‌ గేమ్స్‌లో సిల్వర్‌ మెడల్‌ విజేతకు రూ. 20 లక్షలు, రాజమహేంద్రవరం ఆర్‌.సాత్విక్‌ సాయిరాజ్, బాడ్మింటన్, ఏషియన్‌ గేమ్స్‌లో సిల్వర్, గోల్డ్‌ మెడల్‌ విజేతకు రూ. 50 లక్షలు, విశాఖపట్నంకు చెందిన యర్రాజీ జ్యోతి, అథ్లెటిక్స్, ఏషియన్‌ గేమ్స్‌లో సిల్వర్‌ మెడల్‌ విజేతకు రూ.20 లక్షలు, బొమ్మదేవర ధీరజ్, ఆర్చరీ, ఏషియన్‌ గేమ్స్‌లో సిల్వర్‌ మెడల్‌ విజేతకు రూ. 20 లక్షలు, ఎన్టీఆర్‌ జిల్లాకు చెందిన కోనేరు హంపి, చెస్, ఏషియన్‌ గేమ్స్‌లో సిల్వర్‌ మెడల్‌ విజేతకు రూ. 20 లక్షలు, అనంతపురంకి చెందిన బి.అనూష, క్రికెట్, ఏషియన్‌ గేమ్స్‌లో గోల్డ్‌ మెడల్‌ విజేతకు రూ. 30 లక్షల నగదు బహుమతిని వైసీపీ ప్రభుత్వం విడుదల చేసింది.

publive-image

పతకాలు సాధించినందుకు ఇచ్చే ప్రోత్సాహక

ఈ నగదు పురస్కారంతో పాటు గతంలో పతకాలు సాధించినందుకు ఇచ్చే ప్రోత్సాహక బకాయిలు మొత్తం కలిపి రూ. 4. 29 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఇటీవల జరిగిన ఏషియన్‌ గేమ్స్‌లో ఏపీ నుంచి 13 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. 8 మందికి మొత్తం 11 పతకాలు (5 గోల్డ్, 6 సిల్వర్‌) సాధించారు. ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ మంత్రి ఆర్‌కే రోజా, శాప్‌ ఎండీ హెచ్‌ఎం. ధ్యానచంద్ర, శాప్‌ అధికారి రామకృష్ణ పాల్గొన్నారు.

publive-image

ఇది కూడా చదవండి: కదిరిలో కర్ణాటక మద్యం కలకలం… భారీగా పట్టుకున్న పోలీసులు

#cm-jagan #amaravathi #rk-roja #cm-camp-office #asian-games-athletes
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe