CM Jagan : సీఎం జగన్ ఆస్తుల విలువ తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ ఆస్తులు వివరాలను రిటర్నింగ్‌ అధికారికి సమర్పించిన అఫిడవిట్‌లో బయటపడ్డాయి. జగన్‌ ఒక్కరి పేరు మీదే.. రూ.529.87 కోట్ల విలువైన స్థిర, చరాస్తులున్నాయి. ఆయన భార్య, కూతరు పేర్ల మీద ఉన్న ఆస్తులు కలిపి మొత్తం రూ.757.65 కోట్లు ఉన్నాయి.

EX CM Jagan: జగన్ సంచలన నిర్ణయం.. ఆ నియోజకవర్గాల ఇంఛార్జుల మార్పు!
New Update

CM Jagan Assets : ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh) ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) ఆస్తులు వివరాలను ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి సమర్పించిన అఫిడవిట్‌లో బయటపడ్డాయి. జగన్‌ ఒక్కరి పేరు మీదే.. రూ.529.87 కోట్ల విలువైన స్థిర, చరాస్తులున్నాయి. అలాగే ఆయన భార్య భారతి రెడ్డి(Bharati Reddy), కుమార్తెలు హర్షిణిరెడ్డి, వర్షారెడ్డి పేర్ల మీద మరికొన్ని ఆస్తులు ఉన్నాయి. వీటన్నింటిని కలిపితే మొత్తం జగన్ కుటుంబ ఆస్తుల విలువ రూ.757.65 కోట్లు. వీటిల్లో ఎక్కువగా వివిధ కంపెనీల్లో వాటాలు, పెట్టుబడుల రూపంలో ఉన్నవే ఉన్నాయి. సీఎం జగన్ తరఫున వైఎస్ మనోహర్ రెడ్డి పులివెందుల రిటర్నింగ్ అధికారికి సోమవారం నామినేషన్ పత్రాలు సమర్పించారు.

Also Read: ఉగ్రదాడులపై బీజేపీ వేగంగా స్పందిస్తోంది : మాజీ ఇండియన్ ఎయిర్‌ ఫోర్స్ చీఫ్

అందులో ఆస్తుల వివరాలను పొందుపరిచారు. అయితే 2019లో జగన్ ఆస్తుల విలువ రూ.375 కోట్లు ఉండగా.. గత ఐదేళ్లలో ఆయన ఆస్తుల విలువ రూ.154.67 కోట్లు అంటే ఏకంగా 48 శాతం పెరిగింది. 2019లో జగన్ కుటుంబ ఆస్తుల విలువ రూ.510.38 లక్షలు కాగా.. ఐదేళ్లలో రూ.247.27 కోట్లు అంటే 48.45 శాతం పెరిగింది. మరో విషయం ఏంటంటే జగన్, ఆయన భార్య భారతిరెడ్డి, కుమార్తెలు హర్షిణిరెడ్డి, వర్షారెడ్డిల్లో ఏ ఒక్కరికీ కూడా సొంత కారు లేనట్లు చూపించారు. వాళ్ల పేరుతో కారు ఉన్నట్లు అఫిడవిట్‌లో ఎక్కడా కూడా చెప్పలేదు. అయితే జగన్ పేరుతో ఒక బుల్లెట్ ప్రూఫ్ స్కార్పియో వాహనం ఉంది. ఇది తన సొంత వాహనం కాదని.. హోం మంత్రిత్వశాఖ సమకూర్చిన వాహనమని అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

Also read: పవన్ కల్యాణ్‌ నామినేషన్.. లైవ్ వీడియో

#telugu-news #cm-jagan #cm-jagan-properties
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe