YCP : మరో 3 నియోజకవర్గాలకు కొత్త ఇంచార్జ్ లు.. జగన్ కీలక ప్రకటన

మరో ముగ్గురు ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చారు వైసీపీ అధినేత జగన్. జగ్గంపేట, ప్రత్తిపాడు, పిఠాపురం ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చారు. వారి స్థానంలో నియోజకవర్గాలకు కొత్త ఇంచార్జ్ లను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో మిగతా ఎమ్మెల్యేల్లో టెన్షన్ నెలకొంది.

New Update
AP Elections 2024: ఏపీ ఎన్నికలు.. సీఎం జగన్ కీలక నిర్ణయం!

Jaggampeta : జగ్గంపేట(Jaggampeta) వైసీపీ ఇన్చార్జిగా తోట నరసింహంను నియమించారు ఆ పార్టీ అధినేత జగన్(Jagan). ప్రత్తిపాడు ఇంచార్జ్ గా పర్వత జానకి దేవి, పిఠాపురం ఇంచార్జ్ గా వంగ గీతా విశ్వనాధ్ ను నియమించారు. దీంతో మరో ముగ్గురు ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వడం లేదని వైసీపీ స్పష్టం చేసింది. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబుకు, పత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే పర్వత ప్రసాద్, పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబుకు టికెట్లు రావని తేల్చింది వైసీపీ.
ఇది కూడా చదవండి: AP POLITICS: ముందుగానే ఎన్నికలు.. బాంబు పేల్చిన జగన్‌!

తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమి తర్వాత ఏపీ సీఎం జగన్ అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత కారణంగానే తెలంగాణ లో బీఆర్ఎస్ ఓడిందని భావిస్తోన్న జగన్.. అనేక మంది ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చాలని భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి: పెన్షన్ రూ.3,000కు పెంపు…రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం

4 రోజుల క్రితమే 11 నియోజకవర్గాలకు కొత్త ఇంచార్జిలను నియమించిన సీఎం జగన్.. తాజాగా మరో 3 స్థానాల్లోనూ అభ్యర్థులను మారుస్తున్నట్లు తేల్చారు. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో టెన్షన్ నెలకొంది. తమ సీట్లలో కొత్త వారిని ఇంచార్జిలను ఎవరినైనా నియమిస్తారా? అన్న ఆందోళన వారిలో వ్యక్తం అవుతోంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు