CM Chandrababu: నేడు కుప్పంకు సీఎం చంద్రబాబు

AP: ఈరోజు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించనున్నారు సీఎం చంద్రబాబు. రెండు రోజులపాటు కుప్పంలో ఉండనున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి కుప్పంలో పర్యటించనున్నారు.

New Update
CM Chandrababu: నేడు కుప్పంకు సీఎం చంద్రబాబు

CM Chandrababu Naidu Kuppam Tour : ఇవాళ తన సొంత నియోజకవర్గం కుప్పంకు సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి కుప్పంలో పర్యటించనున్నారు. కుప్పంలో రెండ్రోజుల పాటు ఉండనున్నారు. ఇవాళ 12.30కు హెలికాప్టర్‌లో PES మెడికల్‌ కాలేజ్‌కు చేరుకుంటారు. కాగా సీఎం హోదాలో వస్తున్న చంద్రబాబుకు ఘనస్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేశారు టీడీపీ శ్రేణులు. అయితే చంద్రబాబు తనను గెలిపించుకుంటూ వస్తున్న కుప్పం ప్రజలపై వరలు కురిపించనున్నారు. అలాగే కట్టుదిట్టమైన భద్రతను పోలీసులు ఏర్పాటు చేశారు.

చంద్రబాబు పర్యటన వివరాలు..

* 12.55కు శాంతిపురం జల్లిగానిపల్లిలో..
* 1.35కు చిన్నారిదొడ్డిలో హంద్రీనీవా కాలువ పరిశీలన
* 2.10కి కుప్పం R&Bగెస్ట్‌హౌస్‌లో విరామం
* 3గంటలకు ఎన్టీఆర్‌ విగ్రహం చౌరస్తాలో బహిరంగసభ
* 4.35కు కుప్పం R&Bగెస్ట్‌హౌస్‌లో పార్టీ నేతలతో సమావేశం
* ఇక రేపు R&Bగెస్ట్‌హౌస్‌లో ప్రజా ఫిర్యాదుల స్వీకరణ
* రేపు మధ్యాహ్నం 12గంటలకు గవర్నమెంట్‌ డిగ్రీ కళాశాలలో అధికారులతో సమీక్ష
* 2.35కు PES మెడికల్‌ కాలేజ్‌లో పార్టీ శ్రేణులతో మీటింగ్‌
* రేపు 4.10కి PES మెడికల్‌ కాలేజ్‌ హెలీప్యాడ్‌ నుంచి తిరుగుపయనం

Also Read: జులైలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు

Advertisment
తాజా కథనాలు