AP News: టిడ్కో ఇళ్లపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్.. నిధుల దుర్వినియోగంపై సీరియ‌స్‌!

టిడ్కో ఇళ్లపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్ పెట్టారని, నిధులు దుర్వినియోగం చేసేవారిపై సీరియస్ యాక్షన్ తీసుకుంటామని మంత్రి పొంగూరు నారాయ‌ణ హెచ్చరించారు. ప్రజ‌ల శ్రేయస్సు కోస‌మే చంద్రబాబు ప్రజా స‌మ‌స్యల ప‌రిష్కార వేదిక కార్యక్రమాన్ని తీసుకొచ్చారని తెలిపారు.

AP News: టిడ్కో ఇళ్లపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్.. నిధుల దుర్వినియోగంపై సీరియ‌స్‌!
New Update

Nellore: ప్రజ‌ల శ్రేయస్సు కోస‌మే ఏపీ సీఎం చంద్రబాబునాయుడు (Chandrababu Naidu) ప్రజా స‌మ‌స్యల ప‌రిష్కార వేదిక కార్యక్రమాన్ని తీసుకొచ్చారని రాష్ట్ర పుర‌పాల‌క‌, ప‌ట్టణాభివృద్ధి శాఖామంత్రి డాక్టర్ పొంగూరు నారాయ‌ణ చెప్పారు. ఈ వేదిక‌లో అప్లికేష‌న్లు తీసుకోవ‌డం మాత్రమే కాదు.. వాటికి స్పాట్‌లోనే ప‌రిష్కారం చూపుతున్నామ‌ని తెలిపారు. ఈ మేరకు నెల్లూరు క‌లెక్టరేట్‌లో శుక్రవారం జ‌రిగిన ప్రజా స‌మ‌స్యల ప‌రిష్కార వేదిక కార్యక్రమంలో రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి (MLA Kotamreddy Sridhar Reddy), క‌లెక్టర్ ఆనంద్‌, ఎస్పీ కృష్ణకాంత్‌, క‌మిష‌న‌ర్ సూర్యతేజల‌తో క‌లిసి మంత్రి పాల్గొన్నారు.

అర్జీల‌కు స్పాట్‌లోనే పరిష్కారం.. 
ఈ సంద‌ర్భంగా మంత్రి ప్రజ‌ల నుంచి అర్జీలు స్వీక‌రించారు. ప‌లువురు బాధితులు తమ స‌మ‌స్యను ప‌రిష్కరించాలంటూ నారాయ‌ణకు మొర పెట్టుకున్నారు. వెంట‌నే స్పందించిన నారాయ‌ణ‌.. కొన్ని అర్జీల‌ను స్పాట్‌లోనే అధికారుల‌తో మాట్లాడి ప‌రిష్కరించారు. మ‌రి కొన్నింటిని క్షుణ్ణంగా ప‌రిశీలించి, విచారించి ప‌రిష్కరించాల‌ని సంబంధిత అధికారుల్ని ఆదేశించారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర మంత్రి డాక్టర్ పొంగూరు నారాయ‌ణ మీడియాతో మాట్లాడుతూ.. ఈ రోజు నిర్వహించిన ప్రజా స‌మ‌స్యల ప‌రిష్కార వేదిక‌లో సుమారు 50 మంది వ‌ర‌కు అర్జీలు ప్రజ‌లు అంద‌చేశాం. కొన్నింటిని స్పాట్‌లోనే ప‌రిష్కరించ‌డం జ‌రిగింది. మ‌రి కొన్నింటిని క్షుణ్ణంగా ప‌రిశీలించి.. త్వరిత‌గ‌తిన ప‌రిష్కరించాల‌ని సంబంధిత అధికారుల‌కు సూచించాం. కొన్నింటిని కేబినెట్ స్థాయిలో ప‌రిష్కరించాలి. వాట‌న్నింటిని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి ప‌రిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ రోజు కొన్ని రెవెన్యూ స‌మ‌స్యలు, అదే విధంగా టౌన్ ప్లానింగ్ శాఖ‌లో మ‌రి కొన్ని స‌మ‌స్యలు వ‌చ్చాయ‌న్నారు. టౌన్ ప్లానింగ్ లో క‌మిష‌న‌ర్ సూర్యతేజ స్పాట్‌లోనే ప‌రిష్కరించేందుకు చ‌ర్యలు చేప‌డుతున్నార‌న్నారు. అదే విధంగా పోలీసు డిపార్ట్ మెంట్ కి సంబంధించి ఒక కేసు వ‌చ్చింద‌ని.. దానిని కూడా ఎస్పీ బాధితుల‌తో మాట్లాడి స‌మ‌స్యను ప‌రిష్కరిస్తాన‌ని చెప్పారు.

వైసీపీ ప్రభుత్వానిది ప్రజలకు కనిపించని పాలన..
ఏదో అర్జీ తీసుకున్నామా... అయిపోయింద‌నే విధంగా కాకుండా బాధితులు అందించే ప్రతీ అర్జీని ప‌రిష్కరించేందుకే సీఎం ప్రజా స‌మ‌స్య‌ల ప‌రిష్కార వేదిక‌ను తీసుకువ‌చ్చార‌న్నారు. ఉదాహార‌ణ‌కు బుచ్చిరెడ్డిపాళెంలో ప్రభుత్వ పార్కు స్థలంలో ఓ వ్యక్తి ఇటుక బ‌ట్టీలు పెట్టుకొని ఉన్నార‌న్నారు. వెంట‌నే సంబంధిత అధికారుల్ని ఆదేశించి...అక్కడ ప‌రిస్థితి ప‌రిశీలించి వివ‌రాలు సేక‌రించాల‌ని చెప్పడం జ‌రిగింద‌న్నారు. ఆ బిల్డింగ్ పూర్తయిపోగానే.. ఆ స్థలంలో పార్కుని నిర్మించాల‌ని ఆదేశాలు జారీ చేయ‌డం జ‌రిగింద‌న్నారు. ముఖ్యంగా ప్రజా స‌మ‌స్యల ప‌రిష్కార వేదిక‌లో అర్జీలు తీసుకోవ‌డం కాద‌ని... వాటిని ప‌రిష్కరించ‌డ‌మే ప్రజా ప్రభుత్వ ల‌క్ష్యమ‌ని నారాయ‌ణ స్పష్టం చేశారు. ఈ సిస్టమ్‌ని కంటీన్యూ చేస్తామ‌ని చెప్పారు. అలాగే టిడ్కో ఇళ్లపై ఇప్పటికే సీఎం చంద్రబాబునాయుడు ప్రత్యేక దృష్టి సారించార‌న్నారు. వాట‌న్నింటిని విజిట్ చేయ‌మ‌ని మంత్రులంద‌రికి సీఎం ఆదేశాలు జారీ చేశార‌న్నారు. ప్రజ‌ల సొమ్ముని దుర్వినియోగం చేసిన వారిని ఎట్టి ప‌రిస్థితిలో వ‌దిలేద‌ని లేద‌ని త‌న‌దైన శైలిలో హెచ్చరించారు. ఈ క్రమంలోనే త‌ణుకులో టీడీఆర్ బాండ్ల‌లో సుమారు రూ. 700 వంద‌ల కోట్లు దుర్వినియోగానికి పాల్ప‌డ్డార‌ని. ఇప్పటికే దానిపై విచార‌ణ జ‌రుగుతోంద‌ని, ఎంక్వైరీ రిపోర్ట్ వ‌చ్చింద‌ని, దానిని కూడా సీఎంకి పంపించ‌డం జ‌రిగింద‌న్నారు. గత ఐదేళ్లు వైసీపీ ప్రభుత్వం ప్రజా పాలన కనిపించని పాలన చేసింది. వీట‌న్నింటిని పూర్తి స్థాయిలో విచారించి.. లీగ‌ల్ గా యాక్షన్ తీసుకుంటామని చెప్పారు.

#chandrababu-naidu #kotamreddy-sridhar-reddy #tidco-houses #dr-ponguru-narayana
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe