NDA Meeting: శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించొద్దని ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు (CM Chandrababu Naidu) సూచించారు. ఈ రోజు అమరావతిలో జరిగిన ఎన్డీఏ శాసన సభా పక్ష సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలు ఎవరూ ఇసుక జోలికి వెళ్లొద్దని స్పష్టం చేశారు. ఇసుక ధరల విషయంలో కొన్ని ఇబ్బందులు వస్తున్నాయని కొందరు ఎమ్మెల్యేలు ప్రస్తావించినట్లు తెలుస్తోంది. అసెంబ్లీలో జగన్, వైసీపీ (YCP) తీరును ఎన్డీఏ శాసన సభా పక్షం తప్పిపట్టినట్లు తెలుస్తోంది. మూడు పార్టీల మధ్య కో-ఆర్డినేషన్ అంశాన్ని నాదెండ్ల మనోహర్ ప్రస్తావించినట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: Raghurama Raju: RRR సంచలనం.. నేరుగా జగన్ దగ్గరికి వెళ్ళి చెవిలో వార్నింగ్!
చంద్రబాబు తీసుకున్న ప్రతీ నిర్ణయాన్ని తనతో పాటు తమ పార్టీ ఎమ్మెల్యేలందరం సపోర్ట్ చేస్తామని పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఈ సందర్భంగా స్పష్టం చేసినట్లు సమాచారం. శాంతి భద్రతలకు (Law and Order) విఘాతం కలిగిస్తే తన మన అనే విషయాన్ని కూడా చూడనని చంద్రబాబు అన్నట్లు తెలుస్తోంది. తననే జైలుకు పంపారని.. కక్ష సాధింపు చేయాలనుకుంటే తానూ చేయగలనని చంద్రబాబు అన్నట్లు సమాచారం. కానీ కక్ష సాధింపు వ్యవహరాన్ని తాను పట్టించుకోవడం లేదు.. ఎమ్మెల్యేలూ కక్ష పూరితంగా వ్యవహరించొద్దని చంద్రబాబు సూచించినట్లు తెలుస్తోంది.
రాజకీయ ప్రతీకారాలకు పోవద్దని.. శాంతి భద్రతల విషయంలో కఠినంగా ఉంటానని ఆయన స్పష్టం చేసినట్లు సమాచారం. ఇసుక విధానాన్ని మరింత పారదర్శకంగా అమలు చేస్తామని చంద్రబాబు అన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇసుక విధానంపై మరిన్ని సూచనలు ఏమైనా ఉంటే ఇవ్వాలని చంద్రబాబు అన్నట్లు సమాచారం. వివేకా మర్డర్ విషయంలోనూ జగన్ వేరే వాళ్లకు మీదకు నెట్టే ప్రయత్నం చేశారని.. ఇప్పుడు కూడా వినుకొండలో ఇదే జరుగుతుందని చంద్రబాబు అన్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Jagan: కూటమిని సింగిల్ డిజిట్ కు పరిమితం చేస్తాం.. జగన్ సంచలన వ్యాఖ్యలు