Chandrababu : సచివాలయ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. పెన్షన్ పంపిణీపై సర్కార్ కీలక ఆదేశాలు..!

పెన్షన్ పంపిణీలో సచివాలయ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు వెసులుబాటు కల్పించారు. భారీ వర్షాలున్న ఆయా ప్రాంతాల్లో ఇబ్బందులుంటే వచ్చే ఒకట్రెండు రోజుల్లో పెన్షన్ పంపిణీ పూర్తి చేయవచ్చని సూచించారు. సచివాలయ ఉద్యోగులపై ఒత్తిడి తీసుకు రావద్దని కలెక్టర్లకు సీఎం ఆదేశించారు.

New Update
AP: మదనపల్లి ఘటనపై సర్కార్ సీరియస్.. ముగ్గురిపై సస్పెన్షన్ వేటు..!

Secretariate Employees : ఏపీ (AP) లో భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పెన్షన్ (Pension) పంపిణీలో సచివాలయ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు (Chandrababu) వెసులుబాటు కల్పించారు. భారీ వర్షాలున్న ఆయా ప్రాంతాల్లో ఇబ్బందులుంటే వచ్చే ఒకట్రెండు రోజుల్లో పెన్షన్ పంపిణీ పూర్తి చేయవచ్చని సూచించారు. సచివాలయ ఉద్యోగులపై ఒత్తిడి తీసుకు రావద్దని, టార్గెట్ పెట్టవద్దని కలెక్టర్లకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. వర్షాలు లేని ప్రాంతాల్లో యధావిధిగా పెన్షన్లు పంపిణీ పూర్తి చేయాలని తెలిపారు.

Also Read: ముంబై నటి కేసులో సంచలనాలు.. ఏపీ పోలీసులు కిడ్నాప్ చేసి..

ప్రతి నెలా ఇస్తున్నట్లు కాకుండా..సెప్టెంబర్‌ నెల పెన్షన్‌ ని ముందుగానే ఇవ్వనున్నట్లు కూటమి ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రతి నెల 1 వ తేదీన పంపిణీ చేసే ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్లను ఈ నెల 31న ఉదయాన్నే పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, భారీ వర్షాల కారణంగా సచివాలయ ఉద్యోగులకు పెన్షన్ పంపిణీ ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు భారీ వర్షాలున్న ప్రాంతాల్లో పెన్షన్ పంపిణీ ఒకట్రెండు రోజుల్లో ఇచ్చేందుకు వెసులుబాటు కల్పించారు.

Advertisment
తాజా కథనాలు