/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/AP-CM-Chandrababu.jpg)
CM Chandrababu Chirala Tour : సీఎం చంద్రబాబు చీరాల (Chirala) పర్యటన రద్దు అయింది. ఆఖరి నిమిషంలో తన పర్యటను రద్దు చేసుకున్నారు సీఎం. చేనేత దినోత్సవంలో పాల్గొనేందుకు చీరాల వెళ్లాల్సిన సీఎం పర్యటన వాయిదా పడినట్లు సీఎంఓ తెలిపింది. ఇప్పటికే ఈ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. చంద్రబాబు పర్యటన సందర్భంగా వరాలు జల్లు కురుస్తాయి అనుకొన్న చేనేతల ఆశలపై వర్షం నీళ్లు చల్లింది. విజయవాడ (Vijayawada) లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చంద్రబాబు (CM Chandrababu) పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ట్రెయిల్ రన్ నిర్వహించారు జిల్లా ఎస్పీ తుషార్.
Also Read : ఒలింపిక్స్‌లో కరోనా కల్లోలం.. భారీగా పెరుగుతున్న పాజిటివ్ కేసులు!