Chandrababu Naidu: పోలీసులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం..

టీడీపీ కార్యాలయం వద్ద బారికేడ్లు పెట్టిన పోలీసులపై సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్తలను కలిసేటప్పుడు బారికేడ్లు పెట్టవద్దని ఆదేశించారు. ప్రజా సమస్యలు, వారి వినతుల స్వీకరణకు ప్రత్యేక వ్యవస్థను రూపొందిస్తామని వెల్లడించారు.

New Update
Andhra Pradesh: కువైట్ మృతులకు 5లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

మంగళగిరి టీడీపీ కార్యాలయం వద్ద బారికేడ్లు పెట్టిన పోలీసులపై సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్తలను కలిసేటప్పుడు బారికేడ్లు పెట్టవద్దని ఆదేశించారు. ' నాకు, ప్రజలకు మధ్య అడ్డుగోడలు ఉండటానికి వీళ్లేదు. ప్రజా సమస్యలు, వారి వినతుల స్వీకరణకు ఎక్కువ సమయం కేటాయిస్తాను. దీనికోసం ప్రత్యేక వ్యవస్థను రూపొందిస్తాం. నిర్దిష్ట సమయంలో సమస్యలు పరిష్కారమయ్యేలా చూస్తాం. పొలవరం సందర్శనతోనే నా క్షేత్రస్థాయి పర్యటన ప్రారంభమైంది. ఎన్నికల ముందు సూపర్-6, ప్రజాగళం మేనిఫెస్టో ప్రకటించాం. ఇచ్చిన హామీలను తప్పుకుండా అమలు చేస్తాం.

Also Read: అవి నా కళ్ళారా చూశాను.. పవన్ కల్యాణ్ సంచలన లేఖ!

20 ఏళ్లలో గెలవని సీట్లు కూడా ఈసారి గెలిచాం. కూటమి 93 శాతం స్ట్రైట్ రేట్‌తో 57 శాతం ఓట్ షేర్ ను సాధించింది. అధికారం వచ్చిందని నేతలు కక్షసాధింపు, విర్రవీగడం చేయవద్దు. ఎమ్మెల్యేలు, నాయకులు కార్యకర్తలను విస్మరించకూడదు. అసెంబ్లీ సమావేశాలు తేదీ కూడా త్వరలో నిర్ణయిస్తామని' సీఎం చంద్రబాబు అన్నారు.

Also Read: డిప్యూటీ సీఎం పవన్ ఫొటోలు కచ్చితంగా ఉండాలి.. ఆయనపై చంద్రబాబు స్పెషల్ ఫోకస్.!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు