Andhra Pradesh:ఉదయం 10 నుంచి 6గంటల వరకు సచివాలయంలోనే..చంద్రబాబు నిర్ణయం

ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకుని రెండు రోజులు అయింది. నిన్న మంత్రులకు శాఖలను కేటాయించారు. మరోవైపు సమీక్షలు నిర్వహిస్తున్నారు. దాంతో పాటూ ప్రతీ రోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 6 వరకు సచివాలయంలోనే ఉండాలని నిర్ణయం తీసుకున్నారు.

New Update
Chandrababu: అధికారులకు సీఎం చంద్రబాబు స్వీట్ వార్నింగ్..!

CM Chandra Babu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బిజీబిజీగా ఉంటున్నారు. మామూలుగానే ఎప్పుడూ సమయపాలన విషయంలో ఎప్పుడూ స్ట్రిక్ట్‌గా ఉండే చంద్రబాబు ఇప్పుడు మరీ కచ్చితంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలకు బయటకు వెళ్ళినప్పుడు తప్ప మిగతా టైమ్‌ అంతా ప్రభుత్వ పాలనలోనే సమయం గడపాలని అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు. దాని కోసం ఉదయం 10 నుంచి సాయంత్రం 6గంటల వరకు సచివాలయంలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. తనతో పాటూ మంత్రులు కూడా రెగ్యులర్‌గా సచివాలయానికి రావాలని ఆయన సూచించారు. ప్రస్తుతం ఉన్న కేబినెట్‌లో చాలామంది మొట్టమొదటి సారిగా మంత్రులు అయినందువలన...వారందరూ పని నేర్చుకోవాలని మంత్రులకు చంద్రబాబు చెప్పారు.

ఇక జిల్లాల్లో, నియోజకవర్గాల్లో కొత్త మంత్రుల పర్యటన పూర్తయ్యాకే తొలి కెబినెట్ భేటీ నిర్వహించే అవకాశం ఉందంటున్నారు. మరోవైపు పోలవరం ప్రాజెక్టు పర్యటన పూర్తయ్యాకనే మొదటి కేబినెట్ సమావేశం నిర్వహించే అవకాశం ఉందంటున్నారు.

Also Read:Andhra Pradesh: టీటీడీ ఈవోగా జే శ్యామల రావు నియామకం

Advertisment
తాజా కథనాలు