Telangana Elections: ఇంకెంతమంది జీవితాలతో ఆడుకుంటారు? భట్టి సంచలన కామెంట్స్..

సీఎం కేసీఆర్ మోసపూరిత హామీలతో దళిత, గిరిజన కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకుంటున్నాయని సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క అన్నారు. ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని విజ్ఞప్తి చేసిన భట్టి విక్కమార్క.. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు.

Telangana Elections: ఇంకెంతమంది జీవితాలతో ఆడుకుంటారు? భట్టి సంచలన కామెంట్స్..
New Update

Bhatti Vikramarka: అధికారం కోసం దళిత, బహుజనుల జీవితాలతో ఆడుకుంటున్నారని బీఆర్ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఫైర్ అయ్యారు కాంగ్రెస్ ఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క. శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. బలహీన వర్గాల ప్రజలను నట్టేట ముంచుతోందన్నారు. ఇవాళ ఆదిలాబాద్‌లో రమాకాంత్ అనే వ్యక్తి దళితబందు రాలేదనే కారణంతో ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు భట్టి విక్రమార్క.

భట్టి విక్కమార్క కామెంట్స్ యధావిధంగా.. 'పాలకులు ప్రజల బాగోగుల గురించి ఆలోచించాలి. కానీ, బలహీనమైన వర్గ ప్రజలు ఏమైనా పర్వాలేదు అనుకుంది రాష్ట్ర ప్రభుత్వం. దళిత, గిరిజన, మైనారిటీ బలహీన వర్గాలు 92 శాతం ఉన్నారు. మీరు సీఎం కావడానికి.. మొదటి దళిత ముఖ్యమంత్రి అని కళల ప్రపంచం సృష్టించారు. దళితులకు 3 ఎకరాల భూమి, దళిత బంధు ఇస్తామన్నారు. ఇవేవి ఇవ్వలేదు. బడ్జెట్‌లో రూ. 17,700 కోట్లు లెక్కలు చూపించారు. కనీసం రూ. 300 కోట్లు కూడా ఖర్చు చేయలేదు. ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో రమాకాంత్ బోనాధ్ మండలంలో దళిత బంధు రాక ఆత్మహత్య చేసుకున్నాడు. నా ఆత్మహత్య మీరే కారణామంటూ లేఖ రాసి చనిపోయారు. రాజ్యాధికారం కోసం ఎన్ని లక్షల మంది జీవితాలతో ఆడుకుంటారు. కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలు చేయడం లేదు. మీ మోసపూరిత వాగ్దానాలతో దళిత, గిరిజన కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకుంటున్నాయి. తెలంగాణ కోసం కన్న కలలు.. నేరేవేరలేదు.' అంటూ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు భట్టి విక్రమార్క.

Also Read: కాళేశ్వరం పై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సంచలన నివేదిక

కాంగ్రెస్ మాత్రమే పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల కలలను నిజం చేస్తుందన్నారు భట్టి విక్రమార్క. దొరల తెలంగాణ పోయి.. ప్రజల తెలంగాణ తీసుకొస్తామని రాహుల్ గాంధీ చెప్పిన మాటలను ఆయన ప్రస్తావించారు. దళిత గిరిజన కుటుంబాలు ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని విజ్ఞప్తి చేసిన భట్టి విక్కమార్క.. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. నెల రోజులు కొట్లాడి కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చుకుందామని పిలుపునిచ్చారు భట్టి విక్కమార్క.

ఇక ఆదిలాబాద్‌లో సూసైడ్ చేసుకున్న రమాకాంత్‌ మృతిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు భట్టి విక్రమార్క. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ అండగా ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కొడుకు కేటీఆర్, కూతురు, అల్లుడు రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారంటూ భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీసీలకు బీజేపీ చేసిందేమీ లేదు: వీహెచ్

మరోవైపు.. గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడిన పీసీసీ మాజీ చీఫ్ వి. హనుమంతరావు కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో బీసీలకు ప్రధాని నరేంద్ర మోదీ చేసిందేమీ లేదన్నారు. సోనియా గాంధీ బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడం వల్లే నేడు ఐఐటీ, ఐఐఎం లలో రిజర్వేషన్లు వచ్చి వేలాది మందికి లబ్ధి జరిగిందన్నారు. బీసీలకు న్యాయం చేయాలని రాహుల్ గాంధీ లేఖ రాశారని తెలిపారు. కుల గణన చేపట్టాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేసిన విషయాన్ని వీహెచ్ ప్రస్తావించారు. బీజేపీ ఇప్పుడొచ్చి బీసీ సీఎం, బీసీ ఘర్జన అంటున్నారని, ఇంతకాలం ఏం చేశారని ఆ పార్టీ నేతలను ప్రశ్నించారు వీహెచ్. బీసీలకు ఇంతకాలం ఏం చేశారని నిలదీశారు వీహెచ్. కాంగ్రెస్ పార్టీ ఒక్కటే బీసీలకు న్యాయం చేస్తుందన్నారు. బీసీలపై బీజీపీ చూపేది కేవలం కపట ప్రేమ మాత్రమే అన్నారు.

Also Read: ప్లీజ్ నన్ను మైలార్డ్ అని పిలవకండి…

#bhatti-vikramarka #telangana-elections #telangana-congress
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe