China: చైనాలో భారీగా నిమోనియా కేసులు.. మన దేశంలో పరిస్థితి ఏంటంటే..

చైనాలో అంతుచిక్కని నిమోనియా కేసులు వెలుగుచూడటం కలకలం రేపుతోంది. ఆ దేశంలో వ్యాప్తి చెందుతున్న శ్వాసకోస వ్యాధులు, ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజాలకు సంబంధించిన కేసులు పరిశీలిస్తున్నామని.. వాటి వల్ల ఇండియాకు ముప్పు తక్కువగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య సంస్థ పేర్కొంది.

New Update
China: చైనాలో భారీగా నిమోనియా కేసులు.. మన దేశంలో పరిస్థితి ఏంటంటే..

చైనాలో పుట్టిన కరోనా ప్రపంచాన్నే వణికించింది. అయితే ఇప్పుడు ఆ దేశంలో మళ్లీ ఓ అంతుచిక్కని నిమోనియా వ్యాధి వెలుగుచూడటం ఆందోళన కలిగిస్తోంది. చైనాలోని స్కూళ్లకు వెళ్లే చిన్నారులు ఈ నిమోనియా బారిన పడ్డారంటూ కథనాలు రావడం కలకలం రేపుతోంది. మరి ఈ వ్యాధి వల్ల మనదేశానికి కూడా ఎదైన ముప్పు ఉంటుందా అనే సందేహాలు నెలకొన్న నేపథ్యంలో భారత ప్రభుత్వం ఈ అంశంపై స్పందించింది. ఈ శ్వాసకోశ వ్యాధులకు సంబంధించిన నివేదికలను పరిశీలిస్తున్నామని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. అయితే చైనాలో వ్యాప్తి చెందుతున్న శ్వాసకోస వ్యాధులు, ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజాల నుంచి ఇండియాకు ముప్పు తక్కువగానే ఉందని స్పష్టం చేసింది. పిల్లల్లో శ్వాసకోస అనారోగ్యానికి సంబంధించి సాధరణ కారణాలే కనిపించాయని.. కానీ ఎలాంటి అంతుచిక్కని వ్యాధికారకాలు, అసాధారణ లక్షణాలు బయటపడలేదని తెలిపింది. ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొంది.

Also Read: గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకున్నారు.. ఎడారిలో ఇరుక్కున్నారు..!

చైనాలోని చిన్నారులకు అంతుచిక్కని నిమోనియా లక్షణాల బారిన పడుతున్నారనే కథనాలు రావడంతో.. ప్రపంచవ్యాప్తంగా వ్యాధుల వ్యాప్తిని పరిశీలించే ప్రోమెడ్ సంస్థ సోషల్ మీడియాలో ఓ పోస్టు చేసింది. దగ్గు, లేకపోయినా ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ రావడం, శ్వాససంబంధ ఇబ్బందులు అలాగే జ్వరం వంటి లక్షణాలతో చిన్నారులు ఆస్పత్రుల్లో చేరుతున్నారని. అయితే ఈ వ్యాధి వ్యాప్తిని అడ్డుకునేందుకు అక్కడి పాఠశాలలను తాత్కాలికంగా మూసివేశారని తెలిపింది. అయితే చైనా వైద్యవర్గాలు బయటపెట్టిన వివరాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించింది. ఈ లక్షణాల వెనుక ఎలాంటి కొత్త వ్యాధికారకాలు లేవని.. ఇప్పటికే వెలుగులో ఉన్న వ్యాధికారకాల వల్లే శ్వాసకోస కేసుల్లో సాధారణ పెరుగుదల ఉందని చైనా చెప్పినట్లు పేర్కొంది. ఇదిలా ఉండగా.. ఈ నిమోనియా కేసులపై చైనా ఇంతవరకు ఎలాంటి బహిరంగ ప్రకటన కూడా చేయలేదు. అంతేకాదు ఆ దేశానికి వెళ్లే ప్రయాణికుల విషయంలో కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎలాంటి హెచ్చరికలు కూడా చేయలేదు.

" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen">

Advertisment
Advertisment
తాజా కథనాలు