Crime: స్కూల్ సెలవుకోసం 1వ తరగతి బాలుడిని చంపిన విద్యార్థి తాను చదువుతున్న స్కూల్ హాలీడే ఇవ్వాలని ఓ విద్యార్థి దారుణానికి పాల్పడ్డాడు. 1వ తరగతి చదువుతున్న బాలుడిపై దాడిచేసి బడికి దగ్గరలోని నీటికుంటలో తోసేశాడు. రెండు రోజుల తర్వాత బాలుడి డెబ్ బాడీ దొరికింది. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లో చోటుచేసుకుంది. By srinivas 08 Feb 2024 in క్రైం నేషనల్ New Update షేర్ చేయండి Kolkata: స్కూల్ సెలవుకోసం ఓ విద్యార్థి దారుణానికి పాల్పడ్డాడు. పట్టుమని పదేళ్లు కూడా నిండని ఆ స్టూండెట్ ప్రపంచం ఆశ్చర్యపోయేలా తనలోని క్రూరత్వాన్ని బయటపెట్టాడు. తన ఆనందం కోసం ముక్కుపచ్చలారని పసి బాలుడిని పొట్టన పెట్టుకున్నాడు. ఈ దారుణమైన సంఘటన పశ్చిమ బెంగాల్‌లోని పురూలియా జిల్లా, ఘస్టోరియాలో జరిగింది. ప్రైవేటు పాఠశాలలో.. ఈ మేరకు పోలీసులు, స్కూల్ యాజమాన్యం తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్‌లోని పురూలియా జిల్లా ఘస్టోరియాలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఈ దారుణం జరిగింది. బడికి సెలవు రావాలనే కారణంతో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థి అదే పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్న పసి బాలుడిని క్రూరంగా హతమార్చాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జనవరి 30న మధ్యాహ్న భోజన విరామం తర్వాత ఒకటో తరగతి చదువుతున్న విద్యార్థి కనిపించకపోవడంతో చుట్టుపక్కల వెతికారు. అయినా ఎక్కడా అచూకీ లభించకపోవడంతో సమాచారం అందిచగానే ఘటన గాలింపు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఇది కూడా చదవండి: Constable: తీరని దుఃఖం.. ప్రభుత్వ లాంఛనాలతో గణేష్ అంత్యక్రియలు విద్యార్థిపై అనుమానం వచ్చి.. అయినా బాలుడి ఆచూకీ లభించలేదు. ఈ క్రమంలోనే రెండు రోజుల తర్వాత అదే పాఠశాలకు దాదాపు 400 మీటర్ల దూరంలోని నీటి గుంటలో పసివాడి మృతదేహం లభ్యమైంది. అయితే మొదట అతనే ప్రమాదవశాత్తూ ఆ గుంటలో పడి ఉంటాడని పోలీసులు భావించారు. కానీ పోస్ట్‌మార్టంలో ఆ బాలుడు హత్యకు గురయ్యాడని తేలింది. ఈ ఘటనపై పురూలియా పోలీసు సూపరింటెండెంట్ అభిజిత్ బెనర్జీ మాట్లాడుతూ.. ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థిపై అనుమానం వచ్చి ప్రశ్నించాం. స్కూల్ సెలవు కోసమే బాలుడిని తీసుకెళ్లి, తలపై కొట్టి, నీటిలోకి తోసేసినట్లు విద్యార్థి అంగీకరించినట్లు వివరించారు. #kolkata #student-killed #school-vacation #class-1-boy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి