Pithapuram: పిఠాపురంలో జనసేన, టీడీపీ నేతల ఫైటింగ్ AP: పిఠాపురంలో టీడీపీ, జనసేన ఇరుపార్టీల మధ్య మరోసారి విభేదాలు బయటపడ్డాయి. తాటిపర్తిలో అపర్ణ దేవి అమ్మవారి ఆలయ బాధ్యతలు అప్పగించే విషయంలో వివాదం రాజుకుంది. పవన్‌ను గెలిపించిన తమకు జనసేన నీచాతి నీచంగా చూస్తోందని టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. By V.J Reddy 09 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి New Update షేర్ చేయండి Janasena VS TDP in Pithapuram: పిఠాపురంలో టీడీపీ, జనసేన ఇరుపార్టీల మధ్య మరోసారి విభేదాలు బయటపడ్డాయి. తాటిపర్తిలో జనసేన, టీడీపీ మధ్య ఆధిపత్య పోరు నెలకొంది. అపర్ణ దేవి అమ్మవారి ఆలయ బాధ్యతలు అప్పగించే విషయంలో వివాదం రాజుకుంది. జనసేన నాయకులకు గతపాలక వైసీపీ కమీటీ అప్పగించింది. ఆలయ బాధ్యతల కోసం జనసేన, టీడీపీ నేతల మధ్య ఘర్షణ నెలకొంది. తోపులాట జరగడంతో ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. అక్కడికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. పవన్ గెలుపు కోసం పని చేసిన మమ్మల్ని జనసేన నీచాతి నీచంగా చూస్తోందని టీడీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన దుశ్చర్యలను జనం చూస్తున్నారని టీడీపీ విమర్శలు చేస్తోంది. ఆలయ తాళాలు గ్రామ కమిటీకి గాని, పూజారికి గానీ ఇవ్వాలని డిమాండ్ చేసింది. అమ్మవారి ఆలయం ముందు టీడీపీ నేతల నిరసన చేపట్టారు. Also Read: తండ్రి మరణంతో రాజకీయాల్లోకి.. 36 ఏళ్లకే హ్యాట్రిక్ ఎంపీ.. నేడు కేంద్ర మంత్రి! #tdp #pithapuram #janasena మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి