CJI: వినదగునెవ్వరు చెప్పిన.. యువతకు చీఫ్ జస్టిస్ హితబోధ

పంతాన్ని పక్కన పెట్టి, ఇతరుల అభిప్రాయాలనూ వినగలిగే పరిణతి అందరిలోనూ రావాలన్నారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్‌. దాడి, హింస, ఇతరులను అగౌరవం పాలు చేయడం ద్వారా ఆధిపత్యం చూపించుకోగలమనుకుంటే పొరపాటని సీజేఐ అన్నారు.

author-image
By Naren Kumar
CJI: వినదగునెవ్వరు చెప్పిన.. యువతకు చీఫ్ జస్టిస్ హితబోధ
New Update

Justice Chandrachud: పంతాన్ని పక్కన పెట్టి, ఇతరుల అభిప్రాయాలనూ వినగలిగే పరిణతి అందరిలోనూ రావాలన్నారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్‌ (Justice Chandrachud). పుణె లోని సింబయాసిస్‌ ఇంటర్నేషనల్‌ యూనివర్సిటీ 20వ గ్రాడ్యుయేషన్ సెరెమొనీ (graduation ceremony)లో పాల్గొన్న సీజేఐ పలు ఆసక్తికరమైన అంశాలను వ్యాఖ్యానించారు. దాడి, హింస, అగౌరవాల ద్వారా ఆధిపత్యం చూపించుకోగలమనుకుంటే పొరపాటని సీజేఐ అన్నారు. మానవత్వంతో ప్రవర్తించేవారే నిజంగా బలవంతులన్నారు.

ఇది కూడా చదవండి: ఉరకలేస్తున్న యువ రక్తం.. చిన్న వయసులో అసెంబ్లీలో అడుగుపెట్టిన ఎమ్మెల్యేలు!

ఇతరుల మాటలను పట్టించుకోకపోవడం ప్రస్తుతం మన సమాజం ఎదుర్కొంటున్న సమస్య అన్న ఆయన ఇతరుల మాటను వినే పరిణతి ఉంటేనే ప్రపంచాన్ని కొత్తగా అర్థం చేసుకోగలమన్నారు. వినయం, ధైర్యం, చిత్తశుద్ధిని అలవరచుకోవాలని సూచించారు.

ఇటీవల తాను సోషల్ మీడియాలో చూసిన ఓ రీల్‌ గురించి సీజేఐ వివరించారు - ఒక బాలిక తమ ప్రాంతంలోని రోడ్ల దుస్థితిపై ఆందోళన వ్యక్తం చేసిన వీడియో అది. అది చూసిన వెంటనే తనకు 1848 నాటి పరిస్థితులు గుర్తొచ్చాయని సీజేఐ తెలిపారు. ఆ కాలంలో సావిత్రిబాయి పూలే (Savitribai Pule) బాలికా విద్యను ప్రోత్సహించడంతో కొందరు ఛాందస వాదులు ఆమెపై స్కూల్‌ వెళ్లే సమయంలో చెత్తా చెదారాన్ని విసిరేసేవారని, అందుకే తనతో ఒక అదనపు చీరను ఆమె తీసుకెళ్లేవారని చెప్పారు. పరిస్థితుల్లో పరివర్తనకు తాను చూసిన వీడియో నిదర్శనమన్నారు.

#supreme-court #cji-justice-dy-chandrachud
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe