Delhi: సుప్రీంకోర్టు కుక్ కూతురుకు US స్కాలర్‌షిప్.. CJI చంద్రచూడ్ ఏం చేశారంటే! సుప్రీంకోర్టు కుక్ కూతురు ప్రగ్యా.. న్యాయశాస్త్రంలో మాస్టర్స్‌ను అభ్యసించేందుకు US స్కాలర్‌షిప్‌కు ఎంపికవడంపై CJI చంద్రచూడ్ సంతోషం వ్యక్తం చేశారు. చంద్రచూడ్, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల బృందం ప్రగ్యాతోపాటు ఆమె పెరెంట్స్ ను సన్మానించారు. ప్రగ్యాకు అవసరమైన సాయం చేస్తామన్నారు. By srinivas 14 Mar 2024 in Uncategorized New Update షేర్ చేయండి Chandrachud: సుప్రీంకోర్టు కుక్ అజయ్ కుమార్ సమాల్ కూతురు US స్కాలర్‌షిప్‌కు ఎంపికవడంపై భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) చంద్రచూడ్ సంతోషం వ్యక్తం చేశారు. యూఎస్‌లోని యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా, మిచిగాన్ యూనివర్శిటీలో న్యాయశాస్త్రంలో మాస్టర్స్‌ను అభ్యసించేందుకు స్కాలర్‌షిప్‌లకు ఎంపికైన 25 ఏళ్ల యువతి ప్రగ్యాను సత్కరించారు. ప్రగ్యా తల్లి ప్రమీలా, తండ్రి అజయ్ లను జస్టిస్ చంద్రచూడ్, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల బృందం అధికారిక నివాసంలో సన్మానించారు. అవసరమైన సాయం చేస్తాం.. ఈ మేరకు చంద్రచూడ్ మాట్లాడుతూ.. ప్రగ్యా చదువు కోసం అవసరమైన వాటిని సమకూర్చేందుకు తమ వంతు సాయం చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ఇక దీనిపై సంతోషం వ్యక్తం చేసిన ప్రగ్యా.. 'నా తల్లిదండ్రులు వెంటనే సీజేఐ కలవాలనుకుంటున్నారంటూ రమ్మని పిలిచారు. భయంతో అక్కడికి వెళ్లినప్పటికీ నాకే ఆశ్చర్యంగా అనిపించింది. సీజేఐతోపాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తులందరూ అక్కడే ఉన్నారు. వారు నా తల్లిదండ్రులను సత్కరించారు' అని చెప్పింది. ఇది కూడా చదవండి: Ranji Trophy: 42వ సారి.. రంజీ ట్రోఫీ కైవసం చేసుకున్న ముంబై! అలాగే 'నాకు మూడు పుస్తకాలు ఇచ్చారు. అందులో న్యాయమూర్తులంతా సంతకం చేశారు. ఇది నాకు ప్రత్యేక అనుభూతి. నేను నిజంగా గౌరవంగా ఫీల్ అవుతున్నా. అందరూ నన్ను అభినందించారు. నా జీవితంలో నాకు ఇది చాలా పెద్ద విషయం' అంటూ ప్రగ్యాతోపాటు కుటుంబ సభ్యులు భాగోద్వేనికి లోనయ్యారు. #us-scholarships #cji-chandrachud #honours #sc-cooks-daughter మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి