Mahesh Babu : 'తండ్రిగా గర్వపడే రోజు ఇది'.. గౌతమ్ కోసం మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్..!
టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు పుత్రోత్సాహంలో మునిగితేలుతున్నారు . కుమారుడు గౌతమ్ ఘట్టమనేని గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్న సందర్భంగా ఎమోషనల్ ట్వీట్ చేశారు. "నా హృదయం గర్వంతో ఉప్పొంగుతోంది. తండ్రిగా నేను గర్వపడే రోజు ఇది" అంటూ భావోద్వేగపూరిత పోస్ట్ పెట్టారు.