Harom Hara : ఓటీటీలోకి సుధీర్ బాబు యాక్షన్ ఎంటర్టైనర్ 'హరోం హర'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
సుధీర్ బాబు హీరోగా నటించిన 'హరోం హర' మూవీ ఓటీటీలోకి రాబోతుంది. జూన్ 14న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా మొదట ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవుతుందని అన్నారు. కానీ జులై 11 నుంచి 'ఆహా' ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు 'ఆహా' పోస్టర్ తో అధికారికంగా ప్రకటించింది.