Harsha Sai : ఎట్టకేలకు బయటికొచ్చిన హర్షసాయి.. కేసుపై ఏమన్నాడంటే!?

యూట్యూబర్ హర్షసాయి ఎట్టకేలకు హైకోర్టు ముందస్తు బెయిల్‌తో బయటికొచ్చాడు. సోమవారం ఉదయం విదేశాల నుండి తిరిగి వస్తూ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నాడు. ఈ క్రమంలోనే ఎయిర్ పోర్ట్ లో మీడియాతో..' నేను ఏ తప్పు చేయలేదని, ఎవరిని డబ్బులు డిమాండ్ చేయలేదని అన్నారు.

New Update

 
ప్రముఖ యూట్యూబర్ హర్షసాయిపై ఇటీవల ఓ నటి కేసు పెట్టిన విషయం తెలిసిందే. తన దగ్గర రెండు కోట్ల రూపాయలు తీసుకోని, తనని పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని సదరు నటి అతనిపై పోలీసులకు పిర్యాదు చేసింది. అప్పటి నుంచి హర్ష సాయి పరారీలో ఉన్నాడు. ఇక ఎట్టకేలకు హైకోర్టు ముందస్తు బెయిల్‌తో బయటికొచ్చాడు. హర్షసాయి ఇన్నాళ్లూ విదేశాల్లో తలదాచుకున్నట్లు తెలుస్తోంది. 

చిన్న పని మీద వెళ్ళాను..

ఉన్నట్టుండి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ప్రత్యక్షమయ్యాడు. సోమవారం ఉదయం విదేశాల నుండి తిరిగి వస్తూ శంషాబాద్ ఎయిర్ పోర్ట్  కు చేరుకున్నాడు. ఈ క్రమంలోనే ఎయిర్ పోర్ట్ లో మీడియాతో మాట్లాడుతూ.." నేను ఏ తప్పు చేయలేదు. నేను ఎవరినీ డబ్బులు డిమాండ్ చేయలేదు. ఒక చిన్న పని మీద వెళ్ళాను. అక్కడ పని పూర్తి చేసుకుని నేడు తిరిగి హైదరాబాద్ వచ్చాను. 

Also Read : ప్రభాస్ కు జోడిగా నయనతార.. 17 ఏళ్ళ తర్వాత క్రేజీ కాంబో రిపీట్

నా మీద వచ్చినటువంటి ఆరోపణలు అసత్యం కాబట్టే నాకు బెయిల్ మంజూరు అయింది. నేను రాసిన నేను తీసినటువంటి సినిమాకి వాళ్లే కాపీరైట్స్ అడిగారు. నేను ఎక్కడ ఎవరిని డబ్బులు డిమాండ్ చేయలేదు. మనీ మేక్స్ మెనీ థింగ్స్ అంటారు కదా అదే జరిగింది. మధ్యలో ఉన్నటువంటి కొందరు ఈ విధంగా కావాలని నన్ను ప్రజలలో చులకన చేయడానికి నా ఇమేజ్ ను దెబ్బతీయడానికి అసత్య ప్రచారాలు చేశారు. కానీ పోలీసుల విచారణలో నిజానిజాలు బయటికి వచ్చేయి కాబట్టే ఈ రోజు నాకు కోర్ట్ బెయిల్ ఇచ్చింది.." అంటూ చెప్పుకొచ్చాడు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు