నేడు మన రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్ డే అనే విషయం అందరికీ తెలిసిందే. సోషల్ మీడియా అంతా డార్లింగ్ పేరుతో మారుమోగిపోతుంది. ఫ్యాన్స్ నుంచి సెలెబ్రిటీస్ వరకు అందరూ సోషల్ మీడియాను వేదికగా చేసుకొని ప్రభాస్ కు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. కాగా 'రాజా సాబ్' మూవీ టీమ్ ప్రభాస్ బర్త్ డే రోజు ఓ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు అనౌన్స్ చేసింది. చెప్పినట్లుగానే సర్ప్రైజ్ తో ఫ్యాన్స్ ను షాక్ కు గురయ్యేలా చేశారు.
షాకింగ్ లుక్ లో డార్లింగ్..
ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా 'రాజా సాబ్' సినిమా నుంచి వీడియోతో కూడిన స్పెషల్ మోషన్ పోస్టర్‌ని విడుదల చేశారు. అందులో ప్రభాస్ సింహాసనంపై కూర్చొని చేతిలో సిగార్ పటుకొని మహారాజులా కూర్చున్నాడు. ఈ పోస్టర్ లో ప్రభాస్ లుక్ చాలా డిఫెరెంట్ గా భయంకరంగా ఉంది. ఈ సినిమా హారర్ విత్ కామెడీ జోనర్ లో ఉంటుందని మరోసారి ఈ వీడియోతో చెప్పేశారు మేకర్స్.
Rebellion and royalty didn’t just come…..they’re in his blood 🤙🏻🤙🏻
— People Media Factory (@peoplemediafcy) October 23, 2024
The Powerful and Majestic reign of #TheRajaSaab will set new rules across the board 🔥
Motion Poster ▶️ https://t.co/J3iUABZ4il#HappyBirthdayPrabhas ❤️
April 10, 2025 – A REBEL’s ENTERTAINMENT EXPLOSION 💥… pic.twitter.com/LWHqpViU4m
Also Read : ప్రభాస్ బర్త్ డే సెలెబ్రేషన్స్.. పొట్టు పొట్టు కొట్టుకున్న ఫ్యాన్స్
ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన పోస్టర్స్ లో ప్రభాస్ స్టైలిష్ లుక్స్ తో యంగ్ గా కనిపించగా.. తాజాగా వదిలిన మోషన్ పోస్టర్ లో మాత్రం కాస్త ఓల్డ్ గెటప్ లో దర్శనమిచ్చాడు. దీంతో సినిమాలో ప్రభాస్ డ్యూయెల్ రోల్ లో కనిపిస్తారా? అనే సందేహం అభిమానుల్లో కలుగుతుంది.
మొత్తానికి మారుతి ఈసారి ప్రభాస్ తో ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడని అర్థమవుతోంది. ప్రస్తుతం 'రాజా సాబ్' మోషన్ పోస్టర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్, ఇస్మార్ట్ భామ నిధి అగర్వాల్ ఫీ మేల్ లీడ్ రోల్స్ లో కనిపించనున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు.