Akhanda 2 : బాలయ్యపై ఇండస్ట్రీలో కుట్ర.. అందుకే అఖండ 2 ఆపేశారా?

అఖండ-2 మూవీ రిలీజ్‌ వాయిదాపై డైరెక్టర్, నిర్మాతలపై బాలయ్య సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. అర్థరాత్రి 2 గంటలకు డైరెక్టర్‌ బోయపాటి ఇంటికి వెళ్లిన బాలకృష్ణ బోయపాటితో పాటు నిర్మాతలకు క్లాస్‌ పీకారని టాక్‌.

New Update
akhanda 2

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన అఖండ 2: తాండవం విడుదల వాయిదా పడింది. నేడు వరల్డ్ వైడ్ గా థియేటర్లలోకి రావాల్సిన ఈ సినిమా, అనివార్య కారణాల వల్ల వాయిదా వేస్తున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ గురువారం అర్థరాత్రి అధికారికంగా ప్రకటించింది. ఈ నిర్ణయంతో బాలయ్య అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.

సినిమా వాయిదాకు గల అనివార్య కారణాలు ఏంటో నిర్మాణ సంస్థ స్పష్టంగా పేర్కొననప్పటికీ, న్యాయపరమైన సమస్యలే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది. ఈరోస్ ఇంటర్నేషనల్ నిర్మాణ సంస్థ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. గతంలో 14 రీల్స్ సంస్థతో కలిసి నిర్మించిన 1 నేనొక్కడినే, ఆగడు చిత్రాలకు సంబంధించి తమకు రావాల్సిన రూ. 28 కోట్ల బకాయిలు చెల్లించేంత వరకు అఖండ 2 విడుదల నిలిపివేయాలని ఈరోస్ సంస్థ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం అఖండ 2 విడుదల ఆపాలని ఉత్తర్వులు జారీ చేసింది. 

నిజానికి ఈ సినిమా ప్రీమియర్ షోలను గురువారం సాయంత్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో ప్రదర్శించడానికి ఏర్పాట్లు చేశారు. అయితే చివరి నిమిషంలో సాంకేతిక కారణాల వల్ల ప్రీమియర్ షోలు రద్దు చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీనిపై గందరగోళం నెలకొన్న కొన్ని గంటల్లోనే అఖండ 2 చిత్రాన్ని పూర్తిగా వాయిదా వేస్తున్నట్లు నిర్మాణ సంస్థ 14 రీల్స్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.

వరుస విజయాలతో దూసుకుపోతున్న బాలకృష్ణపై, ముఖ్యంగా అఖండ 2 వంటి భారీ హిట్ సీక్వెల్‌ను తొక్కెయడానికే ఇండస్ట్రీలోని కొన్ని వర్గాలు కుట్ర పన్ని, చివరి నిమిషంలో ఈ విడుదలను అడ్డుకున్నాయనే ఆరోపణలు బాలయ్య అభిమానుల నుంచి బలంగా వినిపిస్తున్నాయి. తమ హీరో క్రేజ్‌ను దెబ్బతీయడానికే, ఆర్థిక వివాదాలను సాకుగా వాడుకుని ఈ ప్లాన్ అమలు చేశారా అని అభిమానులు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. హిందూ మతం, సనాతన ధర్మం వంటి అంశాలతో అఖండ 2 తెరకెక్కింది. టీజర్, ట్రైలర్, ప్రమోషన్స్ తో ఆ అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. బాలయ్యను ఇండస్ట్రీలో తొక్కెయడానికే అఖండ 2 రిలీజ్ వాయిదా ప్లాన్ చేశారని ఫ్యాన్స్ అంటున్నారు. ఎవడు ఎదురొచ్చిన మా బాలయ్యను ఆపే దమ్ము ఎవడికి లేదని, బాలయ్యకు ఎవడు ఎదురొచ్చినా వాడికే రిస్క్ .. బాలయ్య ఒకడికి ఎదురు వెళ్లినా వాడికే రిస్క్.. తొక్కి పడేస్తాం అంటూ డైలాగ్స్ తో వార్నింగ్స్ ఇస్తున్నారు. 

కనపడితే కొట్టేలా

ఇక14 రీల్స్ అధినేత రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట కనపడితే కొట్టేలా ఉన్నారు అభిమానులు. ఓ పెద్ద హీరోతో సినిమా నిర్మించేటపుడు ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి కదా అని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు ఎవరో కుట్ర చేసి బాలయ్య సినిమాను ఆపారంటూ ఫైర్ అవుతున్నారు. ఈ సినిమా పోస్ట్ పోన్ అయినందుకు బాలకృష్ణ.. తన ప్రతి అభిమానితో పాటు .. ప్రేక్షకులకు క్షమాపణలు కూడా చెప్పారు. త్వరలోనే కొత్త తేదిని ప్రకటిస్తామని చెప్పారు. 

అఖండ-2 మూవీ రిలీజ్‌ వాయిదాపై డైరెక్టర్, నిర్మాతలపై బాలయ్య సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. అర్థరాత్రి 2 గంటలకు డైరెక్టర్‌ బోయపాటి ఇంటికి వెళ్లిన బాలకృష్ణ బోయపాటితో పాటు నిర్మాతలకు క్లాస్‌ పీకారని టాక్‌. ఫ్యాన్స్‌తో ఆటలొద్దని బోయపాటి, నిర్మాతలకు బాలయ్య వార్నింగ్‌ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. సాయంత్రం కల్లా సినిమా రిలీజ్‌ అవ్వాలన్న బాలయ్య గట్టిగా వార్నింగ్ ఇచ్చారని సమాచారం. 

Advertisment
తాజా కథనాలు