Viswam: ఓటీటీలోకి గోపిచంద్ మూవీ.. ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కానుందంటే? హీరో గోపీచంద్, శ్రీను వైట్ల దర్శకత్వంలో ఇటీవల విడుదలైన విశ్వం సినిమా ఓటీటీ రైట్స్‌ను అమెజాన్ సొంతం చేసుకుంది. ఈ మూవీ దీపావళికి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. By Kusuma 15 Oct 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి Viswam: డైరెక్టర్ శ్రీను వైట్ల, హీరో గోపీచంద్ కాంబోలో తాజాగా విశ్వం సినిమా విడుదలైంది. సినిమా విడుదలైనప్పటి నుంచి పాజిటివ్ టాక్ ఎక్కువగా వినిపిస్తోంది. సినిమాలో కామెడీ బాగా ఉందని, థియేటర్లలో చూసిన వారు తప్పకుండా నవ్వుకుంటారని రిలీజ్‌కి ముందు చెప్పినట్లే.. చూపించారు. అయితే శ్రీను వైట్ల పదేళ్ల కిందట ఎన్టీఆర్‌తో బాద్‌షా సినిమా హిట్ తర్వాత మళ్లీ ఒక్కటి కూడా సరైన హిట్ పడినట్లు లేదు. ఇది కూడా చూడండి: BIG BREAKING: మహా ఎన్నికలకు మోగనున్న నగారా! భారీ గ్యాప్ తర్వాత.. మాస్ మాహారాజా రవితేజతో 2018లో అమర్ అక్బర్ ఆంటోని చిత్రాన్ని శ్రీను వైట్ల తెరకెక్కించాడు. కానీ ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. దీని తర్వాత ఎక్కువ గ్యాప్ తీసుకుని విశ్వం సినిమాతో ప్రేక్షకుల ముందు వచ్చారు. భారీ గ్యాప్ తీసుకుని వచ్చినా.. కమ్ బ్యాక్ సినిమా అని చెప్పుకోవచ్చు. సినిమా స్టోరీ రొటీన్‌గా ఉన్న కామెడీ పండటంతో హిట్ టాక్ వినిపిస్తోంది. దసరా పండుగ కావడంతో బాక్సాఫీస్ దగ్గర బాగానే కలెక్షన్స్ కూడా రాబట్టిందని టాక్ వినిపిస్తోంది. ఇది కూడా చూడండి: ప్రభాస్ ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్.. డార్లింగ్ మొదటి సినిమా రీరిలీజ్ ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ కొనుగోలు 12 కోట్ల రూపాయలకు చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్ కూడా భారీగానే సొంతం చేసుకుంది. అయితే దీపావళి కానుకగా ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయాలని భావిస్తున్నారట. అక్టోబర్ 29 లేదా నవంబర్ 3వ తేదీన ఈ చిత్రం అమోజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇది కూడా చూడండి: DSC 2024: టీచర్ నియామకాల్లో బయటపడ్డ ఫేక్ సర్టిఫికేట్లు.. వారికి షాక్! సినిమా టీజర్, ట్రైలర్ విడుదలైన తర్వాత ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే జరిగిందట. నైజాంలో రూ.4 కోట్లు, సీడెడ్‌లో రూ.1.5 కోట్లు, ఆంధ్రాలో రూ.4.5 కోట్లు రెండు రాష్ట్రాల్లో థియేట్రికల్ బిజినెస్ చేసింది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్ కలుపుకుని రూ.1.5 కోట్ల వ్యాపారం జరిగింది. అంటే ఈ సినిమాకు వరల్డ్ వైడ్‌గా రూ.11.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇది కూడా చూడండి: Ap Govt:వారిపై చంద్రబాబు సర్కార్ సీరియస్.. రంగంలోకి ఇంటెలిజన్స్! #gopichands-viswam మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి