/rtv/media/media_files/3bjl3d9BYn0F1sGmrGpN.jpg)
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'విశ్వంభర'. సోషియో ఫాంటసీ డ్రామాగా రూపొందుతోన్న ఈ మూవీ పై అంచనాలు భారీ స్థాయిలో పెరుగుతున్నాయి. 'విశ్వంభర' లో మెగాస్టార్ సరసన కోలీవుడ్ బ్యూటీ త్రిష కథానాయికగా నటిస్తున్నారు. దాదాపు 18 ఏళ్ళ తర్వాత వీరిద్దరూ కాంబో మళ్ళీ రిపీట్ అవుతుండడం ఆసక్తిగా మారింది. ఇప్పటికే మొదలైన ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
వచ్చే ఏడాది 2025 సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు మేకర్స్. తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. రేపు 'విశ్వంభర' టీజర్ రిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు. దసరా సందర్భంగా ఉదయం 10:49 గంటలకు టీజర్ రాబోతుందని సరికొత్త పోస్టర్ తో తెలిపారు. ఈ పోస్టర్ లో చిరు కత్తి పట్టుకొని ఉన్న లుక్ టీజర్ పై ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది.
Also Read : ఆలియా భట్ కూతురి కోసం రామ్ చరణ్ ఏం చేశాడో తెలుసా?
ఫ్యాన్స్ రెడీ అవ్వండమ్మా..
అంతేకాదు పోస్టర్ లో మెగాస్టార్ కత్తి పట్టుకొని ఆవేశంగా వెళ్తున్నట్టు ఉండటంతో టీజర్ లో సోషియో ఎలిమెంట్స్ తో పాటు మంచి మాస్ సీన్ కూడా ఉంటుందేమో అని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఈ పోస్టర్ చూసిన ఫ్యాన్స్.. రేపు దసరా సెలెబ్రేషన్స్ 'విశ్వంభర' టీజర్ తోనే స్టార్ట్ అవుతాయని నెట్టింట పోస్టులు పెడుతున్నారు.
The most awaited arrival will also be the most celebrated one ❤️🔥#VishwambharaTeaser out tomorrow at 10:49 AM ✨#Vishwambhara will be MEGA MASS BEYOND UNIVERSE 💥💥
— UV Creations (@UV_Creations) October 11, 2024
MEGASTAR @KChiruTweets @trishtrashers @DirVassishta @mmkeeravaani @AshikaRanganath @kapoorkkunal @NaiduChota… pic.twitter.com/gMASYXF3pj
ఇక ఈ సినిమాను యువీ క్రియేషన్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. ఆస్కార్ విజేత ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా .. చంద్రబోస్ లిరిక్ రైటర్ గా వ్యవహరిస్తున్నారు. ఇషా చావ్లా, ఆషికా రంగనాథ్ లతో పాటూ మరో ఇద్దరు హీరోయిన్స్ కీ రోల్స్ ప్లే చేస్తున్నట్లు తెలుస్తోంది.