/rtv/media/media_files/2025/05/19/OWGl5qqJsRf3U6SzJPaL.jpg)
త్వరలో తాను పెళ్లి చేసుకుంటానని హీరో విశాల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విశాల్ పెళ్లి గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తమిళ హీరోయిన్ సాయి ధన్సికతో విశాల్ త్వరలో ఏడడుగులు వేయనున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం . ఇప్పటికే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని టాక్ నడుస్తోంది. వీరి ప్రేమకు పెద్దలు అంగీకారం తెలిపారని దీంతో త్వరలోనే వీరిద్దరూ పెళ్లితో ఒకటి కాబోతున్నట్లుగా జాతీయ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇంతగా న్యూస్ వైరల్‌గా మారిన ఈ వార్తలను ఉద్దేశించి అటు విశాల్ కానీ సాయి ధన్సిక మాత్రం ఇంతవరకు స్పందించలేదు.
Actor #Vishal is going to officially announce his marriage with #SaiDhanshika this evening ✨
— Sugumar Srinivasan (@Sugumar_Tweetz) May 19, 2025
He has also signed a new film with Eeti director Ravi Arasu🤝 official announcement coming soon 🔜
Puratchi Thalapathy Vishal is back 🔙 pic.twitter.com/bupDlrsJjL
ఇదేం మొదటిసారి కాదు
విశాల్ పెళ్లి గురించి ఇలాంటి వార్తలు రావడం ఇదేం మొదటిసారి కాదు. గతంలోనూ ఆయన పెళ్లిపై ఎన్నో వార్తలు వచ్చాయి. వరలక్ష్మి, అభినయ వంటి పలువురు హీరోయిన్స్ పేర్లు కూడా వినిపించాయి. నడిగర్ సంఘం బిల్డింగ్ నిర్మాణం పూర్తైన వెంటనే తాను పెళ్లి చేసుకుంటానని గతంలో విశాల్ ప్రకటించారు. ఇటీవలే ఆ బిల్డింగ్ నిర్మాణం కూడా పూర్తైంది. ఈ విషయంపై ఆయన మీడియాతో మాట్లాడారు. పెళ్లి గురించి మాట్లాడారు.
‘‘త్వరలోనే పెళ్లి చేసుకుంటా. నా జీవిత భాగస్వామిని కనుగొన్నాను. ఇప్పటికే పెళ్లి గురించి మా మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఇది తప్పకుండా ప్రేమ వివాహమే. త్వరలోనే మరిన్ని వివరాలు తెలియజేస్తా’’ అని విశాల్ చెప్పుకొచ్చారు. కాగా విశాల్‌కు గతంలో అనీషా అనే నటితో నిశ్చితార్థం జరిగింది. అయితే అనివార్య కారణాల వల్ల వీరిద్దరి పెళ్లి రద్దైంది. తమిళనాడుకు చెందిన సాయి ధన్సిక పలు తమిళ చిత్రాల్లో నటించారు. ఇక తెలుగులో తెరకెక్కిన షికారు, అంతిమ తీర్పు, దక్షిణ వంటి చిత్రాల్లో హీరోయిన్‌గా నటించారు.
సోమవారం సాయంత్రం జరగనున్న సాయి ధన్షిక నటించిన యోగి దా సినిమా కార్యక్రమానికి విశాల్ ముఖ్య అతిధిగా పాల్గొననున్నాడు. ఈ కార్యక్రమంలో ఆయన వివాహ ప్రకటన చేయవచ్చనే ఊహాగానాలు ఉన్నాయి.