/rtv/media/media_files/2025/10/20/viral-video-2025-10-20-19-04-40.jpg)
viral video
దీపావళి అంటేనే అందరికీ ముందుగా గుర్తొచ్చేది టపాసులు.. పండక్కి రెండు, మూడు రోజుల ముందు నుంచే టపాసుల మోతతో నగరాలు హోరెత్తిపోతాయి. అయితే ఈ టపాసులు పేల్చడంలో కూడా కొందరు వింత వింత విన్యాసాలను ప్రదర్శిస్తుంటారు. ఇప్పుడు ఇలాంటి ఒక వీడియోనే నెట్టింట ఫుల్ వైరల్ అవుతోంది. సాధారణంగా 1000 వాలా టపాసులను నేలపై పెట్టి పేల్చడం చూసుంటారు. కానీ, మన హీరో గారు మాత్రం ఏకంగా ఒంటి చుట్టూ చుట్టుకొని పేల్చి పారేశాడు. ఇందుకు సంబంధించిన ప్రస్తుతం ఇంటర్నెట్ లో ఫుల్ వైరల్ అవుతుండగా.. ఇది చూసిన నెటిజన్లు ''ఇదెక్కడి పిచ్చి రా బాబు!'' అంటూ తలలు పట్టుకుంటున్నారు.
https://x.com/Ravanaroy/status/1980152605818110088
వైరల్ వీడియో
వీడియోలో ఉన్న వ్యక్తి 1000 వాలా టపాసుల దండను నడుము నుంచి కాళ్ళ చుట్టూ చుట్టుకోగా.. అతడి రెండు చేతులను తాళ్లతో కట్టేశారు. ఆ తర్వాత మరో వ్యక్తి ఆ టపాసులకు నిప్పంటించాడు. నిప్పంటించిన వెంటనే, ఆ టపాసులు ఒకదాని తర్వాత ఒకటిగా భయంకరమైన వేగంతో టప టప పేలడం మొదలుపెట్టాయి. మంటలు, పొగ, చెవులు చిల్లులు పడే శబ్దాల మధ్య ఆ వ్యక్తి నిలబడి ఉన్నాడు. ఈ దృశ్యం చూస్తున్న వారికి గుండె జారిపోయేలా ఉంది. ఇది చూసిన వారు రకరకాలుగా స్పందిస్తున్నారు... "అయ్యా బాబూ! పటాసులు నేలపై పేలడానికి తయారు చేశారు. ఒంటిపై పేల్చుకోవడానికి కాదు అంటూ ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. మరో వ్యక్తి అసలు ఇలాంటి మతిలేని పనులు ఎందుకు చేస్తారు.. ఇలా చేస్తే ఏం వస్తుంది? కేవలం కొన్ని వ్యూస్, లైకులు కోసం ఇలా ప్రాణాల మీదకు తెచ్చుకుంటారా? అంటూ మండిపడుతున్నారు.
Chiranjeevi: అబ్బా.. పిక్స్ అదిరిపోయాయి! మెగాస్టార్ ఇంట నాగార్జున, వెంకీ మామ దీపావళి వేడుకలు