The GOAT Collections: 4 రోజుల్లో రూ. 288 కోట్లు.. GOAT బాక్సాఫీస్ హవా!

తమిళ స్టార్ తలపతి విజయ్ 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకెళ్తోంది. విడుదలైన నాలుగు రోజుల్లోనే రూ. 288 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఈ విషయాన్ని మేకర్స్ ట్విట్టర్ వేదికగా తెలియజేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు.

New Update
GOAT collections

The GOAT Collections

The GOAT Collection:  తమిళ్ సూపర్ స్టార్ విజయ్ తలపతి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' (GOAT). వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఆగస్టు 15న విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఉగ్రవాద వ్యతిరేక స్క్వాడ్ మాజీ నాయకుడు గాంధీ కథను అనుసరిస్తూ సాగిన ఈ చిత్రం ప్రేక్షకులను విపరీతంగా  ఆకట్టుకుంటోంది. తొలిరోజు నుంచే భారీ ఓపెనింగ్స్ తో బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకెళ్తోంది. దేశవ్యాప్తంగా భారీ వసూళ్లను రాబడుతోంది. మూడు రోజుల్లోనే రూ. 100 కోట్ల మార్క్ ను దాటేసింది.

నాలుగు రోజుల్లో రూ. 288 కోట్లు

తాజాగా 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' నాలుగు రోజుల కలెక్షన్స్ బయటకు వచ్చాయి. విడుదలైన నాలుగు రోజుల్లోనే దేశవ్యాప్తంగా రూ. 288 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఈ విషయాన్ని మేకర్స్ ట్విట్టర్ వేదికగా అధికారికంగా ప్రకటించారు. "4 రోజుల్లో ₹288 కోట్లు జస్ట్ విజయ్ తలపతి థింగ్స్" అంటూ పోస్టర్ రిలీజ్ చేశారు. వీకెండ్స్ లో అద్భుతమైన బిజినెస్ చేయడంతో వసూళ్లు మరింత పెరిగాయి. తమిళనాడు, కర్ణాటక, కేరళ దక్షిణాది రాష్ట్రాలలో ఈ సినిమా ఆదరణ ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

GOAT కలెక్షన్స్

మొదటి రోజు రూ. 44 కోట్లతో 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' ఈ చిత్రం ఖాతా తెరిచింది. రెండవ రోజు రూ.25.5 కోట్ల బిజినెస్ చేసింది. ఆ తర్వాత వారంలోనే ఈ సినిమా వసూళ్లు భారీగా పెరిగాయి. మూడు రోజుల్లోనే దేశవ్యాప్తంగా ఈ సినిమా రూ.100 కోట్ల మార్కును దాటేసింది. ఈ చిత్రంలో విజయ్ డ్యూయల్ రోల్ ప్లే చేశారు. తండ్రీ కొడుకులుగా నటించారు. వైభవ్, లైలా, మోహన్, అరవింద్ ఆకాష్, అజయ్ రాజ్, మీనాక్షి చౌదరి, యోగి బాబు, ప్రశాంత్, ప్రభుదేవా, స్నేహ, అజ్మల్ అమీర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు