/rtv/media/media_files/2025/10/11/rowdy-janardhan-2025-10-11-13-43-13.jpg)
Rowdy Janardhan
Rowdy Janardhan: రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) కొత్త సినిమాకు సంబంధించిన అఫిషియల్ అనౌన్స్ మెంట్ ఇటీవలే విడుదలైంది. ‘రాజా వారు రాణి గారు’ ఫేమ్ రవికిరణ్ కోల దర్శకత్వంలో రూపొందబోయే ఈ సినిమాకు ఇటీవల పూజా కార్యక్రమం కూడా ఘనంగా జరిగింది. ఈ సినిమాలో విజయ్ సరసన నటి కీర్తి సురేశ్ తొలిసారి నటించనుండడం విశేషం. ఈ క్రేజీ కాంబినేషన్‌తో రూపొందుతున్న సినిమాకు “రౌడీ జనార్దన్” అనే టైటిల్ ఖరారైంది.
Also Read: కెరీర్ మీద ఫోకస్ పెట్టిన పికిల్స్ పాప.. బిగ్ బాస్ హౌస్‌లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ?
మలయాళ సంగీత దర్శకుడు టాలీవుడ్ ఎంట్రీ?
తాజా సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తల ప్రకారం, ఈ చిత్రానికి మలయాళ సంగీత దర్శకుడు క్రిస్టో జెవియర్ సంగీతాన్ని అందించనున్నారు. ఇదే నిజమైతే, క్రిస్టో జెవియర్‌కు ఇది తెలుగు సినిమా ఇండస్ట్రీలో తొలి చిత్రం అవుతుంది.
Also Read: విజయ్ దేవరకొండ - కీర్తి సురేష్ జోడీ కన్‌ఫర్మ్.. పూజా కార్యక్రమం త్వరలో!
క్రిస్టో జెవియర్ ఇప్పటికే బ్రమయుగం, టర్బో, సూక్ష్మదర్శిని వంటి మలయాళ చిత్రాలకు మ్యూజిక్ ఇచ్చి మంచి గుర్తింపు పొందారు. ఇప్పుడు ఆయన తెలుగులోకి అడుగు పెడుతుండడంతో సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. అయితే, ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.
Also Read: హాట్ అండ్ క్యూట్ లుక్స్‌లో మెహ్రీన్..
దిల్ రాజు నిర్మాణంలో
ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. విజయ్ దేవరకొండ గతంలో చేసిన సినిమాల కంటే ఈ సినిమా కొంచెం కొత్త స్టైల్‌లో ఉండబోతుందని సమాచారం.
ఇక 'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ చేస్తున్న మరో సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. రౌడీ జనార్దన్ తర్వాత ఆ ప్రాజెక్ట్ కూడా త్వరలో విడుదలకు సిద్ధమవుతుంది.
Also Read: వైరల్ అవుతోన్న 'OG' హీరోయిన్ ప్రియాంక మోహన్ AI ఫోటోలు..
విజయ్ దేవరకొండ - కీర్తి సురేశ్ కాంబినేషన్‌పై అభిమానుల్లో ఇప్పటికే భారీగా ఆసక్తి నెలకొంది. దీనికి తోడు మలయాళ మ్యూజిక్ టాలెంట్ అయిన క్రిస్టో జెవియర్ ఈ సినిమాకు సంగీతం అందించనున్నారు. దీనిపై అధికారిక ప్రకటన వెలువడితే, ఇది టాలీవుడ్‌లో మరో క్రాస్-ఇండస్ట్రీ కలయికగా నిలవనుంది.