vijay devarakonda: 3 సినిమాలు 3 డిఫరెంట్ జానర్స్.. రౌడీ బాయ్ వరుస లైనప్స్!

స్టార్ హీరో విజయ్ దేవరకొండ వరుస లైనప్ తో బిజీగా ఉన్నారు. కింగ్ డమ్ త్వరలో విడుదల కానుండగా.. ఆ తర్వాత మరో రెండు ప్రాజెక్ట్స్ సిద్ధంగా ఉన్నాయి. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో ‘VD 14’, రవి కిరణ్ కోలాతో ‘SVC 59’ చేయనున్నారు.

New Update

vijay devarakonda: లైగర్ డిజాస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్టు కోసం ఎదురుచూస్తున్నారు. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. అభిమానులను  ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత వచ్చిన ఫ్యామిలీ స్టార్ కూడా యావరేజ్ అనిపించుకుంది. దీంతో రౌడీ బాయ్  తన అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ విషయంలో మరింత ఫోకస్డ్ గా వ్యవరిస్తున్నట్లు తెలుస్తోంది. చాలా సెలెక్టివ్ గా, భిన్నమైన కథలను ఎంచుకుంటున్నారు. 

వరుస లైనప్స్ 

ఈ క్రమంలోనే మరో రెండు ఇంట్రెస్టింగ్ సినిమాలను లైన్లో పెట్టారు. విజయ్ తన బర్త్ సందర్భంగా ఈ సినిమాలను ప్రకటించారు. ఈ రెండు సినిమాలు డిఫరెంట్ జానర్స్, విభిన్న కథాంశంతో రూపొందనున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఒకటి రాహుల్ సంకృత్యాన్ డైరెక్ట్ చేయనుండగా .. మరొకటి రవికిరణ్ కోలా కాంబోలో రానుంది. 

రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రాన్ని  ‘VD 14’ అనే వర్కింగ్ టైటిల్ తో అనౌన్స్ చేశారు. ఇది ఒక తీవ్ర భావోద్వేగ కథగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన లుక్ పోస్టర్ విడుదల చేయగా.. అందులో విజయ్ ఒక బెస్ట్ మోడ్ లో సన్యాసి చిత్రపటానికి ముందు ధ్యానం చేస్తూ కనిపించారు."దేవుడు అతనికి బలాన్ని ఇచ్చారు. యుద్ధం అతడికి లక్ష్యాన్ని నడిపించింది అంటూ పోస్టర్ షేర్ చేశారు. 

vijay upcoming movies
vijay upcoming movies

 ‘SVC 59’  అంటూ రవి కిరణ్ కోలా దర్శకత్వంలో మరో మూవీ కూడా అనౌన్స్ చేశారు. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా ఉంటుందని అంచనాలు వినిపిస్తున్నాయి. వీటితో పాటు ప్రస్తుతం 'కింగ్ డమ్' సినిమాతో మే 30కి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని రూపొందించారు.  ఇలా 3 డిఫరెంట్ జానర్  ఫ్యాన్స్ ని మెప్పించేందుకు సిద్దమవుతున్నాడు విజయ్. మరి ఇందులో విజయ్ కి బ్రేక్ ఇవ్వబోయే సినిమా ఏదవుతుందో చూడాలి. 

telugu-news | cinema-news | telugu-cinema-news | vijay devarakonda upcoming projects

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు