Vijay Devarakonda: హీరో విజయ్ దేవరకొండకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్!

హీరో విజయ్ దేవరకొండకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీ 'కింగ్డమ్' సినిమా టికెట్ రేట్ల పెంపునకు అనుమతిచ్చింది. సింగిల్ స్క్రీన్స్ లో రూ. 50, మల్టీప్లెక్స్ థియేటర్స్ లో రూ. 75 వరకు పెంచుకోవచ్చని ఆదేశాలు జారీ చేసింది.

New Update

Vijay Devarakonda: హీరో విజయ్ దేవరకొండకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అయితే విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ  'కింగ్డమ్' ఈ నెల 31న థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రయూనిట్ ఏపీలో టికెట్ రేట్ల పెంపునకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాసింది. దీనికి ప్రభుత్వం స్పందిస్తూ..  టికెట్ రేట్ల పెంచుకోవడానికి  అనుమతిచ్చింది. జీఎస్టీతో  కలిపి  సింగిల్ స్క్రీన్స్ లో రూ. 50, మల్టీప్లెక్స్ థియేటర్స్ లో రూ. 75 వరకు పెంచుకోవచ్చని ఆదేశాలు జారీ చేసింది. విడుదల తేదీ నుంచి 10 రోజుల వరకే ఈ ధరలు అమ్మల్లో ఉంటాయని తెలిపింది.  

హై యాక్షన్ డ్రామా 

భారీ అంచనాలతో యాక్షన్ థ్రిల్లర్ గా  రూపొందిన ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు. సితార ఎంటర్ టైనమెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ కథానాయికగా నటించింది. ఇందులో విజయ్ ఒక నిజాయితీగల పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. నిజాయితీగల ఒక  పోలీస్ ఆఫీసర్ ని   తప్పుడు కేసులో ఇరికించి జైల్లో పెట్టిన తర్వాత.. అతడి జీవితం ఎలాంటి మలుపు తీసుకుంది? అనేది దాని చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది.  ఈ కథలో విజయ్ దేవరకొండ, సత్యదేవ్ అన్నదమ్ములగా కనిపించబోతున్నారు.

ఇప్పటికే వీరిద్దరి బంధం నేపథ్యంలో విడుదలైన ''అన్నా అంటే''.. సాంగ్ సోషల్ మీడియాలో సూపర్ హిట్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఈ చిత్రానికి యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించారు.  విజయ్ దేవరకొండ గతకొన్ని చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద  ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. దీంతో 'కింగ్డమ్' సక్సెస్ విజయ్ కమ్ బ్యాక్ కి కీలకంగా మారింది. 

Also Read: Hari Hara Veera Mallu: థియేటర్ వద్ద పిడిగుద్దులతో తనుకున్న పవన్ ఫ్యాన్స్! వీడియో వైరల్

Advertisment
తాజా కథనాలు