హర్షసాయికి మద్దతుగా వీడియోలు.. ప్రముఖ ఫిలిం క్రిటిక్ అరెస్ట్

హర్ష సాయిని సపోర్ట్ చేస్తూ ఫిలిం క్రిటిక్ దాసరి విజ్ఞాన్ ఫేక్ ఆడియోస్, ఫేక్ సాక్షాలు సృష్టించి యూట్యూబ్ లో పెట్టాడు. ఈ నేపథ్యంలో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఆయనపై 72 BNS, 356 (1) BNS 67 of IT Act 2008 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

hr sai
New Update

యూట్యూబర్ హర్ష సాయి పై ఓ యువతి కేసు పెట్టిన విషయం తెలిసిందే.పెళ్లి పేరుతో రూ. 2కోట్లు తీసుకొని తనను  మోసం చేసినట్లు యువతి ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు హర్ష సాయిపై 376, 354 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇప్పటికే హర్ష సాయి పై పోలీసులు లుక్ అవుట్ నోటీసులు విడుదల చేశారు. 

ఫేక్ సాక్షాలతో వీడియోలు చేసి ..

అయితే ఈ యూట్యూబర్ ను సపోర్ట్ చేస్తూ ఫిలిం క్రిటిక్ దాసరి విజ్ఞాన్ యూట్యూబ్‌లో వరుసగా వీడియోలు చేస్తున్నాడు. హర్ష సాయి కేస్‌లోను బాధితురాలిదే తప్పంటూ ఫేక్ ఆడియోస్, ఫేక్ సాక్షాలు ముందు పెట్టి వీడియోస్ చేశాడు. ఈ నేపథ్యంలో బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా.. పోలీసులు ఆయనపై 72 BNS, 356 (1) BNS 67 of IT Act 2008 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. 

Also Read : రామ్ చరణ్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్..?

దాసరి విజ్ఞాన్ గురించి చెప్పాలంటే.. ఎప్పుడు వివాదాస్పద అంశాలపై యూట్యూబ్ లో విశ్లేషణలు చేస్తుంటాడు. అంతేకాకుండా ఆ వివాదాలకు సంబంధించి అసత్య ప్రచారాలు, నీచమైన కామెంట్స్ చేస్తూ సినీ, రాజకీయ సెలబ్రిటీల ప్రైవసీకి భంగం కలిగిస్తున్నాడు. 

ఇటీవల సెన్సేషన్ ను క్రియేట్ చేసిన కొండా సురేఖ కామెంట్స్ పై కూడా రియాక్ట్ అవుతూ.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి హీరోయిన్లతో నిజంగానే సంబంధాలు ఉన్నాయంటూ కొన్నిఫేక్ ప్రూఫ్స్ నిజాలుగా ప్రచారం చేశాడు. అంతేకాదు తిరుమల లడ్డూ వివాదం, నాగార్జున, కొండా సురేఖ ఎపిసోడ్స్ లోను ఫేక్ న్యూస్ ప్రచారం చేసినట్లు పోలీసులు గుర్తించారు.

#tollywood
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe