రోజావే చిన్నిరోజావే సింగర్ జయచంద్రన్ కన్నుమూత

ప్రముఖ గాయకుడు పి జయచంద్రన్ కన్నుమూశారు.  ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందతూ తుదిశ్వాస విడిచారు. జయచంద్రన్ కు ప్రస్తుతం 80 సంవత్సరాలు.  వెంకటేష్ హీరోగా వచ్చిన సూర్యవంశం సినిమాలో రోజావే చిన్ని రోజావే సాంగ్ తో పాటుగా పలు సాంగ్స్ పాడారు.

New Update
singer passed

singer passed Photograph: (singer passed )

ప్రముఖ గాయకుడు పి జయచంద్రన్ కన్నుమూశారు.  కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతూ 2025 జనవరి 9 గురువారం రోజున త్రిస్సూర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందతూ తుదిశ్వాస విడిచారు. జయచంద్రన్ కు ప్రస్తుతం 80 సంవత్సరాలు.  సమారు ఆరు దశాబ్దాలకు పైగా మలయాళం, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ బాషలలో 16 వేలకు పైగా పాటలు పాడి భారతదేశంలోని అత్యంత బహుముఖ గాయకులలో ఒకరిగా జయచంద్రన్ నిలిచారు. మాలు, భక్తిగీతాలు, లలిత సంగీతంలో ఆయన గాత్రం ప్రసిద్ధి చెందింది.

1944లో సంగీత విద్వాంసుడు రవివర్మ కొచనియన్ తంపురాన్, సుభద్ర కుంజమ్మ దంపతులకు జన్మించిన జయచంద్రన్ చలనచిత్ర సంగీతంలో తన ప్రయాణాన్ని1966లో ప్రారంభించారు.  1985లో ఉత్తమ నేపథ్య గాయకునిగా జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని అందుకున్నారు.   జయచంద్రన్ ఐదు కేరళ రాష్ట్ర అవార్డులు, నాలుగు తమిళనాడు రాష్ట్ర అవార్డులు లభించాయి. తమిళనాడు ప్రభుత్వం నుండి కలైమామణి అవార్డుతో కూడా సత్కరించింది.  

2020లో మలయాళ సినిమాకు చేసిన విశిష్ట సేవలకు JC డేనియల్ అవార్డును అందుకున్నాడు. జయచంద్రన్ నటుడు కూడా.. అతను నటుడు కూడా.   మొదట నఖక్షతంగల్ (1986) చిత్రంలో కనిపించారు.   మలయాళ చిత్రం త్రివేండ్రమ్ లాడ్జ్ (2012) లో కూడా ప్రముఖ పాత్రను పోషించారు.  జయచంద్రన్ కు భార్య లలిత, కుమార్తె లక్ష్మి, కుమారుడు దిననాథన్ ఉన్నారు, వీరు సంగీత రంగంలో తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు.

సూర్యవంశం సినిమాలో

తెలుగులో జయచంద్రన్ తక్కువ పాటలు పాడినప్పటికీ తనకంటూ ముద్ర వేశారు. పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన సుస్వాగతం చిత్రంలో హ్యాపీ హ్యాపీ   బర్త్ డేలు,   వెంకటేష్ హీరోగా వచ్చిన సూర్యవంశం సినిమాలో రోజావే చిన్ని రోజావే.. అలాగే తరుణ్ హీరోగా వచ్చిన నువ్వేకావాలి సినిమాలో అనగనగా ఆకాశం ఉంది పాటు అద్భుతంగా ఆలపించారు. జయచంద్రన్ మృతి సౌత్ ఇండస్ట్రీకి తీరని లోటనే చెప్పాలి. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాంపం తెలుపుతున్నారు.  

Also Read :  తెలంగాణలో అందుకే బీర్ల  సరఫరా ఆపేస్తున్నాం :  యూబీఎల్‌ క్లారిటీ

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు