అంతేగా.. అంతేగా :  సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ టాక్

భారీ అంచనాలతో వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ప్రీమియర్ షోస్ పడటంతో ఫ్యాన్స్ ఎక్స్ వేదికగా పోస్టులు పెడుతున్నారు. లాజిక్స్ లేకుండా సినిమా చూస్తే బాగా ఎంజాయ్ చేయోచ్చు.

New Update
venkatesh sankranthiki vasthunam

venkatesh sankranthiki vasthunam Photograph: (venkatesh sankranthiki vasthunam)

విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన చిత్రం  సంక్రాంతికి వస్తున్నాం.  ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. సంక్రాంతికి వస్తున్నాం చిత్రాన్ని  ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు.  ట్రైలర్, సాంగ్స్, ప్రమోషన్స్ తో భారీ అంచనాలను క్రియేట్ చేసిన ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా 2025 జనవరి 14వ తేదీన  భారీ అంచనాలతో రిలీజైంది.  ఇప్పటికేప్రీమియర్ షోస్పడటంతో ఫ్యాన్స్ ఎక్స్ వేదికగా పోస్టులు పెడుతున్నారు.

స్టోరీగా చెప్పుకోవడానికి ఏమీ లేదు కానీ అనిల్ రావిపూడి తనదైన కామెడీ మార్క్ తో సినిమాను ముందుకు నడిపించారని ఫ్యాన్స్ అంటున్నారు. పెళ్లాం, ప్రియురాలి మధ్య నలిగిపోతూ వెంకీ కనబరిచిన నటన మొత్తం సినిమాకే హైలెట్ గా చెబుతున్నారు.  వైడీరాజుగా ఇరగదీశాడని అంటున్నారు.  లాజిక్స్ లేకుండా సినిమా చూస్తే ఫ్యామిలీ ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారని అంటున్నారు.  

వంద కోట్ల మూవీ

ప‌క్కా వంద కోట్ల మూవీ అని అంటున్నారు అభిమానులు.  ఇక సినిమాలోని  పాట‌లు పెద్ద ప్లస్ పాయింట్‌గా మారాయని అంటున్నారు.  గోదారి గ‌ట్టు, మీను పాట‌లు విజువ‌ల్‌గా బాగున్నాయ‌ని చెబుతున్నారు.  ఫ‌స్ట్ హాఫ్ కామెడీతో ఫుల్ ఫన్ క్రియేట్ చేస్తే  సెకండాఫ్ మాత్రం యావ‌రేజ్‌గా ఉంద‌ని అంటున్నారు.  మొత్తానికి ఈ సంక్రాంతికి మూడు పెద్ద సినిమాలు రిలీజైతే అందులో  సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బాస్టర్ హిట్ అని కామెంట్స్ చేస్తున్నారు.  సంక్రాంతి హీరో వెంకీమామనే అని  ఫ్యాన్స్ ట్వీట్లు పెడుతున్నారు.  

Also Read :  సీఎం రేవంత్ దావోస్ పర్యటన ఖరారు.. ! పెట్టుబడులపై సమీక్ష

Advertisment
తాజా కథనాలు