Jayam Manadera: జయం మనదేరా సినిమాకు 25 ఏళ్లు.. ఫస్ట్ టైటిల్ ఎంటో తెలుసా?

వెంకటేష్ కు ఫ్యామిలీ ఆడియన్స్ చాలా ఎక్కువ అన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే మాస్ యాంగిల్ లో కూడా వెంకటేష్ అదరగొడతారు. కానీ ఈ మాస్ తరహా చిత్రాలను ఆయన చాలా తక్కువగానే చేశారు.

New Update
jayam

వెంకటేష్ కు ఫ్యామిలీ ఆడియన్స్ చాలా ఎక్కువ అన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే మాస్ యాంగిల్ లో కూడా వెంకటేష్ అదరగొడతారు. కానీ ఈ మాస్ తరహా చిత్రాలను ఆయన చాలా తక్కువగానే చేశారు. అలాంటి మాస్ బ్లాక్ బాస్టర్ హిట్ మూవీలో ఒకటి జయం మనదేరా. 2025 అక్టోబరు 7వ తేదీకి సరిగ్గా ఈ సినిమా 25 ఏళ్లు పూర్తి చేసుకుంది.ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

శ్రీరాములయ్య సినిమా తరువాత డైరెక్టర్ శంకర్ కు నిర్మాత సురేష్ బాబు పిలిచి మరీ ఆఫర్ ఇచ్చారు. యమజాతకుడు సినిమా తరువాత డైరెక్టర్ శంకర్ కథను రెడీ చేసుకుని వినపించగా వెంకటేష్, సురేష్ బాబు ఇద్దరు వెంటనే  గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పరిచూరి బ్రదర్స్ డైలాగ్స్ రాశారు. ముందుగా టైటిల్ రుద్రమ నాయుడుగా ఫిక్స్ చేశారు. ఆ తరువాత వెంకటేష్ సెంటిమెంట్ కోసం జయం మనదేరాగా మార్చారు. హీరోయిన్లుగా భానుప్రియ, సౌందర్యను తీసుకున్నారు. 

కథలోని అభిరామ్‌ పాత్ర లండన్‌లో ఉండే తెలుగు కుర్రాడు కాబట్టి, సినిమాలోని కొంత భాగాన్ని,యూరప్‌లో దాదాపు 25 రోజులకు పైగా చిత్రీకరించారు. రెండు పాటలను యునైటెడ్ స్టేట్స్లో షూట్ చేశారు. అయితే ఈ సినిమాకు ముందుగా వందేమాతరం శ్రీనివాస్ ను మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకోవడానికి సురేష్ బాబు ఓ కండిషన్ పెట్టారట. ఎందుకంటే ఎక్కువగా విప్లవ సినిమాలకు మ్యూజిక్ చేసిన వందేమాతరం..  జయం మనదేరా సినిమాకు పనిచేయగలరా అనే సందేహం ఆయనలో ఉందట. దీంతో ముందుగా రెండు సాంగ్స్ చేయమని అవి నచ్చితేనే సినిమా చేద్దామని లేదంటే పేరు కూడా వేయమని చెప్పారట. దీంతో వందేమాతరం శ్రీనివాస్  ఈ సినిమాను ఓ ఛాలెంజ్ గా తీసుకుని అదిరిపోయే మ్యూజిక్ అందించారు.

బాక్సాఫీస్ వద్ద విజయం

వందేమాతరం శ్రీనివాస్ అందించిన సంగీతం, ముఖ్యంగా 'మెరిసేటి జాబిలి నువ్వే', 'హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చెయ్యరా' వంటి పాటలు పెద్ద హిట్ అయ్యాయి. ఈ సినిమాతోనే కుమార్ సాను, జస్పిందర్ నరుల తెలుగులో తొలిసారి పాటలు పాడారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడమే కాకుండా, రెండు నంది అవార్డులు, ఒక ఫిల్మ్‌ఫేర్ అవార్డును కూడా గెలుచుకుంది. ఈ సినిమాలోని కులం, వర్ణ వివక్ష వంటి సామాజిక అంశాలను ప్రస్తావించిన తీరు అప్పట్లో ప్రేక్షకుల ఆదరణ పొందడమే కాక, రాజకీయ ప్రముఖుల ప్రశంసలను కూడా అందుకుంది. ఈ చిత్రం తమిళంలో మణికండ పేరుతో రీమేక్ అయ్యింది. అర్జున్, జ్యోతిక హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకు ప్రభాస్ నటించిన  బాహుబలి సినిమాతో చాలా పోలికలుంటాయి. దాదాపుగా రూ.5 కోట్లతో ఈ సినిమాను నిర్మించగా..  ఏకంగా రూ.12.5 కోట్లు కొల్లగొట్టింది, 

Advertisment
తాజా కథనాలు