/rtv/media/media_files/2025/01/12/CrnkSr6xjE6kbXNQ6n18.jpg)
venki mama
Venkatesh: అనిల్ రావిపూడి- విక్టరీ వెంకటేష్ కాంబోలో రాబోతున్న లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ 'సంక్రాంతికి వస్తున్నాము'. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవలే మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి, హీరో వెంకటేష్, హీరోయిన్స్ ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరీ ఈవెంట్ లో పాల్గొని సందడి చేశారు. అయితే ఈ ఈవెంట్ వెంకీ మామ ఎనర్జిటిక్ లైవ్ పర్ఫామెన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
#Venkatesh delivers an electrifying performance of the #BlockbusterPongal song on stage at the #SankranthikiVasthunam Musical Night pic.twitter.com/Qv8CooykX1
— Gulte (@GulteOfficial) January 11, 2025
స్టేజ్ పై వెంకటేష్ లైవ్ పర్ఫామెన్స్..
హీరో వెంకటేష్ ఈ సినిమాలో తాను పాడిన 'బ్లాక్ బస్టర్ పొంగల్' సాంగ్ పాటను లైవ్ లో పాడి వినిపించారు. స్టేజ్ పై సింగర్స్ తో పాటు వెంకీ మామ ఎనర్జిటిక్ పర్ఫామెన్స్ ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ నింపింది. వెంకీ మామ పాట పాడుతుంటే స్టేడియం అంతా కేకలు, విజిల్స్, డాన్సులతో మారుమోగిపోయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ఇది చూసిన నెటిజన్లు.. వావ్! వెంకటేష్ ఎనర్జిటిక్ పర్ఫామెన్స్ అదిరింది అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Also Read: Sankranti 2025: మకర సంక్రాంతికి సరైన పూజ సమయాలివే.. ఆ రోజు ఈ పనులు తప్పక చేయాలి
శ్రీ వెంకటేశ్వర బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరీ ఫీమేల్ లీడ్స్ గా నటించగా.. ఉపేంద్ర లిమాయే, సాయి కుమార్, నరేష్, వీటీ గణేష్, పృథ్వీరాజ్, శ్రీనివాస్ అవసరాల, మురళీధర్ గౌడ్, పమ్మి సాయి, సాయి శ్రీనివాస్, ఆనంద్ రాజ్, మహేష్ బాలరాజ్, ప్రదీప్ కబ్రా, చిట్టి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇందులో వెంకటేష్, మీనాక్షి చౌదరీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు.
Also Read: Sreeleela: అబ్బా! బ్లాక్ శారీలో బార్బీ బొమ్మలా.. ఈ ఫొటోల్లో శ్రీలీలను చూస్తూ ఉండిపోతారు!