Varun Tej VT15: రూట్ మార్చిన మెగా హీరో.. ఇండో- కొరియన్ హర్రర్ కామెడీకి ముహూర్తం!

మెగా హీరో వరుణ్ తేజ్ బర్త్ డే సందర్భంగా తన నెక్స్ట్ మూవీని అనౌన్స్ చేశారు. #VT15 వర్కింగ్ టైటిల్ తో మేర్లపాక గాంధీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఇండో-కొరియన్ హారర్-కామెడీ నేపథ్యంలో రూపొందనున్నట్లు తెలిపారు. ఈరోజు హైదరాబాద్ లో పూజ కార్యక్రమాలతో సినిమాను ప్రారంభించారు.

New Update

Varun Tej VT15:  గాండీవధారి అర్జున, ఆపరేషన్ వాలెంటైన్, మట్కా.. ఇలా వరుస డిజాస్టర్స్ తర్వాత మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ తో సిద్ధమయ్యారు మెగా హీరో వరుణ్ తేజ్. ఈరోజు వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా అతడి నెక్స్ట్ మూవీ అనౌన్స్ చేశారు. #VT15 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. 'ఇండో-కొరియన్ హర్రర్-కామెడీ' అనే ఒక డిఫరెంట్ జానర్ లో రాబోతున్న ఈ సినిమాలో.. వరుణ్ ఇంతకు ముందు ఎన్నడూ చూడని పాత్రను పోషించబోతున్నారు.

Also Read: SIKANDAR Trailer: వైలెన్స్, లవ్, యాక్షన్, డ్రామా.. సల్మాన్ ఖాన్ 'సికందర్' ట్రైలర్ భలే ఉంది!

షూటింగ్ మొదలు 

ఈరోజు హైదరాబాద్ లో పూజ కార్యక్రమాలతో సినిమాను ప్రారంభించారు. డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి, లావణ్య త్రిపాఠి, నిహారిక, నిర్మాతలు మనోజ్ రెడ్డి, వంశీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దర్శకుడు మేర్లపాక గాంధీ సినిమాకు క్లాప్ కొట్టగా.. క్రిష్ జాగర్లమూడి స్క్రిప్ట్ ను అందించారు. రెగ్యులర్ షూటింగ్ కూడా ఈరోజు నుంచే మొదలు కానున్నట్లు తెలిపారు. UV క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇందులో రితిక నాయక్ కథానాయికగా నటిస్తుండగా.. ఎస్.ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. 

telugu-news | latest-news | cinema-news | varun-tej

ఇది కూడా చూడండి: SSMB 29 Updates: అలాంటి సాహసం ఎప్పుడూ చేయలేదు.. SSMB 29 పై రాజమౌళి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు