Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ఇటీవలే తిరిగి ప్రారంభమైన సంగతి తెలిసిందే. పవన్ పవన్ రాజకీయాలతో బిజీగా ఉండడంతో నిలిచిపోయిన ఈ సినిమా షూటింగ్ మళ్ళీ సెట్స్ పైకి వెళ్ళింది. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా సెట్స్ నుంచి లీకైన విజువల్ నెట్టింట వైరల్ గా మారింది. ఇందులో శ్రీలీల- పవన్ కళ్యాణ్ మాట్లాడుకుంటూ కనిపించారు. అంతేకాదు పవన్ పవన్ సన్ గ్లాసెస్, టీ షర్ట్- జీన్స్ ధరించి స్టైలిష్ గా కనిపిస్తూ ఫ్యాన్స్ కి వింటేజ్ వైబ్స్ అందించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
HHVM ledu, OG ledu Team UBS Ra randi ra Chusukundam ,🔥🔥
— SravanPspkvj🦅 (@sravanPspkVj) July 14, 2025
Vintage Kalyan 😭🔥
Thank you @harish2you Anna 🙏🙏#UstaadBhagatSinghpic.twitter.com/Vtp95KhIZq
వచ్చే ఏడాది విడుదల
వీలైనంత త్వరగా షూటింగ్ ముగించుకొని సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మేకర్స్ నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. గతంలో పవన్ - హరీష్ కాంబోలో వచ్చిన "గబ్బర్ సింగ్" ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా తర్వాత దాదాపు 13 ఏళ్ల గ్యాప్ తో ఈ కాంబో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. దీంతో సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి.
డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ సినిమా కథను పవన్ కోసం ప్రత్యేకంగా రూపొందించారట. పవన్ ఫ్యాన్స్ ని అలరించేలా మాస్ అంశాలు, విసిల్‌మార్క్ సన్నివేశాలతో స్క్రిప్ట్‌ను డిజైన్ చేశారని సమాచారం. కథ, పాత్రలు అన్ని కొత్తగా ఉంటాయని చిత్రబృందం తెలిపింది. పవన్ ఇందులో ఇప్పటివరకు చేయని క్యారెక్టర్ చేయనున్నారని తెలుస్తోంది.
Also Read:HBD Balakrishna: తెలుగు ఇండస్ట్రీలో ఆ రికార్డు కేవలం బాలయ్యకే సొంతం.. ఈ విషయాలు మీకు తెలుసా?