Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ సేఫేనా..  డాక్టర్లు కీలక ప్రకటన

హీరో సైఫ్ అలీఖాన్‌ ఆరోగ్యంపై  లీలావతి ఆసుపత్రి డాక్టర్లు కీలక ప్రకటన చేశారు. ఆరు కత్తిపోట్లతో ఆసుపత్రిలో చేరిన సైఫ్ కు సుమారుగా రెండు గంటలకు పైగా కాస్మెటిక్ సర్జరీ చేశారు వైద్యులు. ప్రస్తుతం సైఫ్ ఆరోగ్యం నిలకడగా ఉందని.. అతనికి ఎలాంటి ప్రమాదం లేదన్నారు.

New Update
leelavati hospital

leelavati hospital Photograph: (leelavati hospital)

బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్‌ ఆరోగ్యంపై  లీలావతి ఆసుపత్రి డాక్టర్లు కీలక ప్రకటన చేశారు.  ఆరు కత్తిపోట్లతో ఆసుపత్రిలో చేరిన  సైఫ్ అలీఖాన్‌ కు సుమారుగా రెండు గంటలకు పైగా కాస్మెటిక్ సర్జరీ చేశారు వైద్యులు. ఈ సర్జరీలో సుమారు 2-3 అంగుళాల పొడవు ఉన్న ఓ వస్తువును  బయటకు తీశారు. ప్రస్తుతం సైఫ్ ఆరోగ్యం నిలకడగా ఉందని.. అతనికి ఎలాంటి ప్రమాదం లేదన్నారు. మరికొన్ని రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని వెల్లడించారు. దీంతో అతని ఫ్యాన్ప్ ఊపిరి పిల్చుకున్నారు. ఈ విషయం తెలియగానే  సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ  సైఫ్ అలీఖాన్‌ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.

కాగా  గురువారం తెల్లవారు జామున  సైఫ్ అలీఖాన్‌ ఇంట్లోకి చొరబడిన ఓ దొంగ అతనిపై దాడి చేసి పారిపోయాడు.  ఈ ఘటనలో సైఫ్ అలీఖాన్‌ కు ఆరు చోట్ల కత్తిపోట్లు జరిగాయి. దీంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు.  

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గురువారం తెల్లవారుజామున 3 :30 గంటల ప్రాంతంలో ముంబైలోని  బాంద్రా వెస్ట్‌లోని సైఫ్ అలీఖాన్‌ నివాసంలో ఓ దొంగ సైఫ్ అలీ ఖాన్పై  దాడికి దిగాడు.  ఆర్థరాత్రి ఇంట్లోకి చొరబడిన గుర్తుతెలియని వ్యక్తి ఇంట్లో దొంగతనం చేసి పారిపోతుండగా పనిమనిషికి చిక్కాడు.  దీంతో దొంగకు, పనిమనిషికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.  

 పనిమనిషిని కాపాడేందుకు ప్రయత్నం

ఈ క్రమంలో ఇంట్లో నిద్రపోతున్న సైఫ్ వెంటనే లేచి చూసి పనిమనిషిని కాపాడేందుకు ప్రయత్నం చేయగా దుండగుడు కత్తితో  సైఫ్ పై ఎటాక్ చేశాడు.  ఆరు సార్లు సైఫ్ ను కత్తితో పొడిచి దుండగుడు అక్కడినుంచి పారరయ్యాడు.  వెంటనే  సైఫ్ ను ముంబైలోని  లీలావతి ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.ముంబై పోలీసులు, క్రైమ్ బ్రాంచ్‌లు ఈ  ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనను చాలా సీరియస్ గా తీసుకున్న పోలీసులు  నిందితుడిని పట్టుకోవడానికి  అనేక బృందాలుగా విడిపోయి గాలిస్తున్నారు.  

కాగా 2012లో వివాహం చేసుకున్న కరీనా, సైఫ్ ముంబైలోని బాంద్రా వెస్ట్‌లోని సద్గురు శరణ్ భవనంలో నివసిస్తున్నారు. ఈ దంపతుల ఇద్దరు కుమారులు - తైమూర్ (8), జెహ్ (4) ఉన్నారు.  

Also Read :  Jr NTR : సైఫ్ అలీ ఖాన్పై దాడి... ఎన్టీఆర్ షాకింగ్ రియాక్షన్

Advertisment
తాజా కథనాలు