/rtv/media/media_files/2025/07/30/ana-de-armas-tom-cruise-2025-07-30-11-25-22.jpg)
Ana De Armas - Tom Cruise
Ana De Armas: హాలీవుడ్ సీనియర్ హీరో "టామ్ క్రూజ్"(Tom Cruise) (63), టాలెంటెడ్ హీరోయిన్ "ఆనా డి ఆర్మాస్"(Ana De Armas) (37) మధ్య రిలేషన్‌పై ఊహాగానాలు కొత్తేమీ కావు. కానీ వీరిద్దరూ ఇటీవల అమెరికాలోని 'వెర్మాంట్'(Vermont) లో చేతులు పట్టుకుని తిరుగుతూ కనిపించి మళ్ళీ వార్తల్లోకెక్కారు, దింతో ఇప్పుడు వీళ్లిద్దరి రిలేషన్‌పై వస్తున్న వార్తలు మరింత హీటెక్కాయి.
జూలై 28, 2025న వీరిద్దరూ వుడ్‌స్టాక్ ప్రాంతంలో నడుస్తూ కలిసి కనిపించారు. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అందులోను వీరు నేషనల్ పార్క్ డ్రైవ్, షాపింగ్, ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేస్తూ కనిపించారు. వీరి మధ్య ఉన్న అనుబంధం చూసి చాలా మంది దీన్ని ఒక “సాఫ్ట్ లాంచ్” లా చూస్తున్నారు అంటే, నెమ్మదిగా వాళ్ల రిలేషన్‌షిప్‌ను పబ్లిక్‌లో తీసుకురావాలన్న ప్రయత్నంగా భావిస్తున్నారు.
Amidst dating rumours, Tom Cruise and Ana De Armas captured today. pic.twitter.com/OPqkvIVai9
— LetsCinema (@letscinema) July 29, 2025
Also Read: మెంటలెక్కించే జాంబీ మూవీ అంటే ఇదే భయ్యా! ఎక్కడ చూడొచ్చంటే..?
ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నంబర్..
వీరిద్దరి మధ్య 26 ఏళ్ల వయస్సు తేడా సోషల్ మీడియాలో పెద్ద చర్చకే దారి తీసింది. కొందరు "ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నంబర్" అంటూ సపోర్ట్ చేస్తుండగా, మరికొందరు మాత్రం అంత వయసు తేడా ఉన్న జంటలు ఎలా కలిసి ఉంటారు అని ప్రశ్నిస్తున్నారు. టామ్ క్రూజ్ గతంలో కెటీ హోమ్‌స్కు విడాకులు ఇచ్చిన తర్వాత తన వ్యక్తిగత జీవితం గురించి బయటకు చాలా తక్కువ మాట్లాడారు. ఇప్పుడు ఇలా పబ్లిక్‌గా ఆనా డి ఆర్మాస్‌తో కనిపించడంతో అభిమానుల్లో ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఈ సంవత్సరం ఫిబ్రవరిలో లండన్‌లో వీరిద్దరూ డిన్నర్ తర్వాత టేక్ అవే ఫుడ్‌తో బయట కనిపించారు. అప్పట్లో టామ్ - ఆనా మధ్య ప్రొఫెషనల్ ప్రాజెక్ట్ చర్చలున్నాయని "People Magazine" పేర్కొంది. అయితే ఇప్పుడు పరిస్థితి చూస్తే అది కేవలం ప్రొఫెషనల్ మాత్రమే కాదేమో అని ఫ్యాన్స్ అనుమానిస్తున్నారు. అలాగే ఇంతకుముందు లండన్‌లోని వెంబ్లీ స్టేడియంలో ఒయాసిస్ లైవ్ కాన్సర్ట్ కి వీరిద్దరూ కలిసి హాజరయ్యారు. అక్కడ కూడా టామ్, ఆనా కలిసి నవ్వుతూ, డ్యాన్స్ చేస్తూ కనిపించడంతో వారి మధ్య ఉన్న రిలేషన్(Ana De Armas - Tom Cruise Relationship) పై అందరికి క్లారిటీ వచ్చింది.
Also Read:ప్రభాస్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే పోస్టర్.. 'రాజాసాబ్' నుంచి అదిరే అప్డేట్!
టామ్ క్రూజ్ ‘Mission Impossible’ సిరీస్‌తో చాలా ఫేమస్. అలాగే ఆనా డి ఆర్మాస్ కూడా ‘Blonde’, ‘Ballerina’ వంటి సినిమాల ద్వారా మంచి పేరు సంపాదించారు. ప్రొఫెషనల్‌గా బిజీగా ఉన్న ఈ ఇద్దరూ ప్రైవేట్ లైఫ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. అందుకే ఇప్పటివరకు వారు వారి రిలేషన్‌షిప్‌పై ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు.
ఇప్పుడు వీరిద్దరి మౌనమే ఫ్యాన్స్‌లో మరింత ఆసక్తిని పెంచుతోంది. అంతేకాకుండా, 'ఇది రిలేషన్‌షిప్‌పై ఓ స్ట్రాటజిక్ సైలెన్స్?' అనే సందేహాలను కూడా రేపుతోంది. ఇప్పుడు అభిమానుల ప్రశ్న ఒక్కటే - టామ్ క్రూజ్, ఆనా డి ఆర్మాస్ నిజంగా ప్రేమలో ఉన్నారా? లేదా ఇది కేవలం ఫ్రెండ్ షిప్ మాత్రమేనా? ఇకపోతే త్వరలోనే వీరిద్దరిలో ఎవరైనా క్లారిటీ ఇవ్వొచ్చు అనే ఆశతో ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
ఏది ఏమైనా, వెర్మాంట్ ట్రిప్ వల్ల వీరి బంధం గురించి ఆసక్తి మళ్లీ ఊపందుకుంది. ఈ జంట ఇలాగే పబ్లిక్‌లో ఎక్కువగా కనిపిస్తే ఇంకెన్నో కొత్త గాసిప్స్ వస్తాయో చూడాలి!