/rtv/media/media_files/2025/01/31/HeU716JAtKikbxwEWuGQ.jpg)
madha gaja raja vishal Photograph: (madha gaja raja vishal)
కోలీవుడ్ స్టార్ విశాల్ హీరోగా సుందర్ సి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ మదగజరాజ. వరలక్ష్మీ శరత్ కుమార్, అంజలి హీరోయిన్లుగా నటించారు. సుమారుగా 12 ఏళ్ల పాటు విడుదలకు నోచుకోని ఈ సినిమాను సంక్రాంతి కానుకగా తమిళంలో రిలీజ్ అయి ఘన విజయాన్ని సాధించింది. దీంతో ఈ సినిమాను తెలుగులో డబ్ చేసి ఈ రోజు అంటే జనవరి 31వ తేదీన ఆడియెన్స్ ముందుకు తీసుకువచ్చారు.
2012లో విశాల్, సుందర్ కాంబోలో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లుగా అనౌన్స్ మెంట్ వచ్చింది. విశాల్ సరసన హీరోయిన్ల కోసం చాలా మందినే సంప్రదించారు. ముందుగా స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్‌కు ఆఫర్ దక్కగా ఆమె ఈ సినిమాను రిజెక్ట్ చేశారు. అనంతరం దర్శకుడు సుందర్ హన్సిక మోత్వానిని సంప్రదించారు. ఆమె సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సినిమా స్టార్ట్ అయ్యాక బిజీ షెడ్యూల్ కారణంగా ఈ సినిమా నుంచి హన్సిక తప్పుకుంది.
అనంతరం కార్తీక నాయర్ ను ఎంపిక చేశారు మేకర్స్. షూటింగ్ వెళ్లే టైమ్ కు కథలో మార్పులు చేశారు సుందర్. ఇందులో ఇద్దరు హీరోయిన్లుకు చోటు కల్పించారు. కథను మార్చడం వల్ల తన పాత్ర తగ్గిపోయిందంటూ కార్తీక నాయర్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. ఆమె స్థానంలోకి తాప్సీ పన్ను వచ్చింది. అయితే అప్పటికే ఆమె చేసిన ఓ హిందీ సినిమా ప్రమోషన్స్ కు సంబంధించి డేట్స్ క్లాష్ రావండంతో ఆమె కూడాఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది. ఫైనల్ గా మాయ పాత్రకు వరలక్ష్మి శరత్‌కుమార్, మాధవి పాత్రకు అంజలిలను ఎంపిక చేశారు. హైదరాబాద్, చెన్నై, జైపూర్ లో సినిమా షూటింగ్ కంప్లిట్ చేశారు.
తమిళ్ లో సూపర్ డూపర్ హిట్ అయిన ఈ సినిమాకు తెలుగులో కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. మరీ ఈ సినిమా తెలుగులో ఎన్ని కోట్లు వసూలు చేస్తుందో చూడాలి.
Also Read : తుపాకీతో కాల్చుకుని ఎస్ఐ ఆత్మహత్య