Pushpa 2: తొలిరోజు 'పుష్ప2' క్రియేట్ చేసిన రికార్డ్స్ ఇవే..! అల్లు అర్జున్ హీరోగా నటించిన 'పుష్ప 2' ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తోన్న విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. తోలి రోజే ఈ సినిమా ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది. By Anil Kumar 07 Dec 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి 1/7 విడుదలకు ముందు బుక్ మై షోలో గంటలో లక్ష టికెట్లు అమ్ముడైన చిత్రంగా ‘పుష్ప2’ రికార్డు నెలకొల్పింది. 2/7 కర్ణాటకలో ‘పుష్ప2’ మొదటిరోజు రూ.23.7 కోట్లు (గ్రాస్) వసూళ్లు చేసింది. తెలుగు సినిమాకు మొదటిరోజే అక్కడ ఈ స్థాయిలో కలెక్షన్స్ రావడం ఇదే తొలిసారి కావడం విశేషం. 3/7 విదేశాల్లో ఈ చిత్రం ఇప్పటివరకు 8 మిలియన్ డాలర్లు వసూళ్లు చేసింది. ఇండియన్ సినిమాకు ఇన్ని ఓపెనింగ్స్ రావడం ఇదే తొలిసారి. 4/7 కేరళలో రూ.6.35 కోట్లతో బాక్సాఫీస్‌ను ఓపెన్ చేశాడు పుష్పరాజ్. 2024లోనే కేరళలో ఇది బిగ్గెస్ట్ ఓపెనింగ్ అని నిర్మాణసంస్థ తెలిపింది. 5/7 తమిళనాడులో ‘పుష్ప2’ మొదటిరోజు రూ.11 కోట్లు (గ్రాస్) వసూళ్లు చేసింది. తెలుగు డబ్బింగ్ సినిమాకు తమిళనాడులో ఇన్ని కోట్లు రావడం ఇదే మొదటిసారి. 6/7 బాలీవుడ్లో ఈ మూవీకి ఫస్ట్‌డే ఏకంగా రూ.72 కోట్లు (నెట్) వచ్చాయి. ఇండియన్ సినిమా చరిత్రలోనే హిందీలో తెలుగు సినిమాకు ఇన్ని కోట్లు రావడం ఇదే తొలిసారి. 7/7 తెలుగు రాష్ట్రాల్లో నైజాంలో రూ.30 కోట్ల షేర్ రాబట్టిన తొలి చిత్రంగా ‘పుష్ప2’ నిలిచింది #allu-arjun #pushpa2 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి